బొమ్మలతో అక్షరాలుబాల గేయం)-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
పొట్టి పొట్టి పిల్లలు
పలక బలపం పట్టారు
చిట్టచిట్ట నడిచారు
చెట్టు కిందికి చేరారు !!

చెట్టు కింద గురువు గారు
బొమ్మలు ఎన్నో పెట్టాడు
ఒక్కొక్క బొమ్మను తీశాడు
పిల్లల చేతికి ఇచ్చాడు !!

అమ్మ బొమ్మ అన్నాడు
అ అక్షరం చూపాడు
ఆవు బొమ్మను ఇచ్చాడు
ఆ అక్షరం నేర్పాడు ,!!

ఇల్లు బొమ్మను చూపాడు
ఇ అక్షరం రాసాడు
ఈతకొలను చూపాడు
ఈ అక్షరం నేర్పాడు !!

ఉరికే ఉడుతను చూపాడు
ఉ అక్షరం అడిగాడు
ఊయల కట్టి ఊపాడు
ఊ అక్షరం చూపాడు !!

కామెంట్‌లు