శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )--ఎం. వి. ఉమాదేవి
666)బ్రహ్మవిత్ -

బ్రహ్మముచక్కగా తెలిసున్నవాడు 
సదాచార సంపన్నుడైనవాడు 
వేదాధ్యయనము చేయుచున్నవాడు 
బ్రహ్మశ్లోకములు పఠిoచువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
667)బ్రాహ్మణః -

వేదజ్ఞాన ప్రబోధకుడైయున్నవాడు 
విద్వాంసుడు అయినట్టివాడు 
సత్కర్మపరునిగా చరించువాడు 
యజ్ఞకర్మలను చేయుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
668)బ్రహ్మిః -

తపములే అంగములైనట్టివాడు 
బ్రహ్మదీక్షలో యుండినవాడు 
వేదము స్వరూపమెరిగినవాడు 
తనయందే పరబ్రహ్మమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
669)బ్రహ్మజ్ఞః -

వేదాంత స్వరూపుడైనవాడు 
బ్రహ్మజ్ఞానమును అందించినవాడు 
వేదపాఠభూమియందున్నవాడు 
బ్రాహ్మణహితము నొనర్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
670)బ్రాహ్మణ ప్రియః -

బ్రహ్మజ్ఞానులను ప్రేమించువాడు 
ధర్మాచరణకు మద్దతిచ్చువాడు 
సాధుసంతులనిష్టపడువాడు 
బ్రాహ్మణప్రియుడయినట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు