చైతన్యగీతి మన ఓటు;- పద్మ త్రిపురారి- జనగామ.
 ఓటండీ ఓటు
ఇది ప్రజాస్వామ్య ఓటు
ప్రజల గెలుపు ఓటు
ప్రగతి పిలుపు ఓటు
                "ఓటండీ"
పేద ధనిక తేడాలేని
జనులంతా ఒకటేనని
చాటేదీ ఓటు
చైతన్య గీతి ఓటు
                 "ఓటండీ"

అండదండ తానయ్యి
గుండె గుడిలో నిలిచేటి
ఘనమైనది మన ఓటు
విలువైనది ఈ ఓటు
             "ఓటండీ"

కష్టాలు కన్నీళ్ళు
తుడిచేందుకు మన ఓటు
కడలియంత అభివృద్ధిని
పొందడానికే ఓటు.
               "ఓటండీ"
మంచివైపు నడిపేటి
నాయకత్వమీ ఓటు
మమత సమత పెంచేటి
మార్గదర్శికే ఓటు.
         "ఓటండీ"
కల్లబొల్లి మాటలకు
అల్లిబిల్లి పలుకులకు
ఎదురు నిలిచి గెలిచేటి
ఆయుధమే ఈ ఓటు
           "ఓటండీ"
అన్యాయం అక్రమాలు
దౌర్జన్యం దోపిడీలు
దగాకోరు ముఠాతీరు
రూపుమాపు ఓటుతీరు.
              "ఓటండీ"

దేశమంటె మట్టికాదు
దేశమంటె మనుషులని
మానవత్వ విలువలనే
పెంచుటకే ఈ ఓటు.
             "ఓటండీ"
నీతినియమ నిజాయితీగ
సేవచేయు దయాగుణులె
సరిలేని నాయకులని
చెప్పేదీ ఈ ఓటు.
              "ఓటండీ"
          

కామెంట్‌లు