జ్జనులు; - సి.హెచ్.ప్రతాప్

 కొందరు వ్యక్తులు అవసరమైతే తమ పని పక్కన పెట్టి ఎదుటి వాళ్ల పని చేస్తారు. అటువంటి వారిని  సజ్జనులని కీర్తిస్తోంది నీతి శాస్త్రంలు. కొంతమంది ఇతరుల పని చేస్తూ, వాళ్ల పని కూడా చేసుకుంటుంటారు. వాళ్లు మధ్యములు. . ఇక చివరగా కొందరు తమ ప్రయోజనాల కోసం ఇతరుల పనులన్నీ పక్కన పెడతారు. వాళ్లు నీచులు.కార్యాలయాలలో తమ పనులకే ప్రాధాన్యత ఇస్తూ, తమకు జీతం చెల్లించే సంస్థ గురించి ఆలోచించక  కూడా తమ సొంత పనుల గురించే ఆలోచిస్తుంటారు. ఇటువంటివారికి తమ స్వార్ధానికి తగిన మూల్యం తప్పక చెల్లించుకోచ్వలిసి వస్తుంది. సజ్జన సాంగత్యం పొందాలంటే, అంతకు ముందుగా మూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే సజ్జనులు ఎవరన్న విషయం బోధపడుతుంది. వారిని కలుసుకోవాలని మనసులో బలంగా కోరుకోవాలి. కోరుకున్నంత మాత్రాన సజ్జనులు మన దగ్గరికి రారు. వారున్న చోటికి మనమే చేరుకోవాలి.సజ్జనుల సాంగత్యంలో మన వ్యక్తిత్వాన్ని మార్చుకోగలగాలి. జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం’ అన్న శంకరాచార్యుల భజగోవింద సూత్రంలో జీవన్ముక్తికి తొలి అడుగు సజ్జన సాంగత్యమే.జనుల యందు ఎవరిలో అయితే ఎల్లప్పుడూ మంచి లక్షణాలను కలిగి ఉంటారో, వారిని సజ్జనులుగా లోకం కీర్తిస్తూ ఉంటుంది. తమకు ఎటువంటి పరిస్థితి ఉన్నాసరే తమయందు ఉన్న గొప్పగుణముల లక్షణాలను కోల్పోనివారిని సజ్జనులుగా లోకం గుర్తు పెట్టుకుంటుంది.చదువులలో సజ్జనులు ప్రధమస్థానంలో ఉండడానికి ఎల్లవేళలా కృషి చేస్తూ ఉంటారు.తమ చుట్టూ ఉన్నవారి ప్రశంసలు పొందుతూ ఉంటారు.వీరిలో ముఖ్యంగా స్త్రీలంటే గౌరవభావం బలంగా ఉంటుంది. స్త్రీయందు మాతృభావనను కలిగి ఉంటారు.నిందజేయడం సజ్జనుల లక్షణం కాదని అంటారు.క్షమాగుణం మెండుగా ఉంటుంది.ఇలా పలు మంచి గుణములు కలిగి, ఆ గుణముల వలన వీరి వ్యక్తిత్వం నలుగురిలో ప్రకాశిస్తూ ఉంటుంది. వీరితో బాటు వీరి కుటుంబ సభ్యులకు కూడా వీరి వలన సంఘంలో గౌరవం పెరుగుతుంది. సజ్జనుడు, తన హృదయమను మంచి ధననిధిలోనుండి సద్విషయములను బయటికి తెచ్చును; దుర్జనుడు చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానినిబట్టి యొకని నోరు మాటలాడును” అని యేసు చెప్పాడు.అల్పుడు కంచుతోనూ, సజ్జనుడు బంగారముతోనూ సమానము అంటోంది నీతిశాస్త్రం.సజ్జనులు సత్పురుషులెన్నడూ పలికేవి నిజాలు~ మహాత్ములకు తెలియనివి భేషజాలు~ అవసరానికి ఆదుకొనగలరు సజ్జనులు- అందుకే మనకెల్లప్పుడూ ఆరాధ్యులు.
కామెంట్‌లు