"ముద్దుగుమ్మ";- లెనీన

 కుసుమ ధర్మన్న కళా పీఠం
===================
అందమైన సుందరీ...
ప్రియుని రాకకై ఎదురు చూపులా...
లేక....
దూరాన వున్న ప్రియుని ఎడబాటులో ఆలోచనలా
మనోహరి నీ నగుమోము చూసిన చాలు...
పరవశించు కుసుమాలు...
కడవెత్తు కొచ్చిన కొమలాంగి...
ఆ కడవకెంత అదృష్టమో...
నీ బుజమున ఆనినందుకు...
కనుల నీ కలలు ఎవరి కోసమో...
ప్రకృతి లో భాగమై...
ప్రకృతికే వన్నె తెచ్చే నీ సోయగం...
చిరు దరహాసం...
వూహాల ఊయలలో తేలియాడే ముగ్ధ మనోహరీ
ఎవరి కోసమో నీ ఎదురు చూపులు...
చెలియల రాకకా...
చెలికాని కోసమా...
కారు చీకటి లాంటి నీ కురులు...
ముద్దులొలికే నీ మోము...
తామరాకులాంటి నీ చరణాలు...
సుకుమారమైన  ఆ హస్తాలు...
చూడముచ్చట గొలిపే నీ రూపం...
నీ వూహలలో వున్న ఆ సుందరాంగుడేవరో  కదా...
కమల రేకుల వంటి నీ కనులు...
ఎదురు చూపులతో అలసి పోయేను...
నీ కళ్ళలో ఆ హొయలు ప్రియుని రాకకై ఎదురు చూపులే...
ఓ పైడి బొమ్మ...
అందాల ముద్దుగుమ్మ.
కామెంట్‌లు