సుప్రభాత కవిత -బృంద
తూరుపు  దిక్కున  గగనాన
కిరణాల చేవ్రాలు చేస్తుంటే
అరుణమైన మేఘమాలలతో
కరచాలనం చేస్తూ సాగివస్తూ....

పొత్తిళ్ళలో పసిపాపలా
లోయలోనుండి కొండలమధ్య
ప్రశాంతంగా చూస్తూ
పలకరింపుగా నవ్వుతూ....

విహంగాల విమానమెక్కి
రెక్కలపై కూచుని
స్వాగతిస్తున్న గాలిని పిలిచి
నులివెచ్చగ ఆలింగనం చేసుకుంటూ..

పొలంలోని గడ్డిపువ్వులు
నెత్తిమీద నీటి చుక్కలతో
కాళ్ళుకడగాలని వేచి ఉంటే
బిందువులకు రంగులద్దుతూ...

మింటిదారిని కాంతి కలశం
ఒంటరిగా సాగుతుంటే ...
గౌరవంగా తప్పుకుంటున్న
మబ్బుల దరిచేరి మంతనాలు చేస్తూ...

జగతిలోన చైతన్యం నింపి
అణువణువూ జీవం పంచి
అఖిల జీవరాశులకూ ఆధారమై
అనవరతమూ కాపాడే ఆదిత్యుని

స్వాగతిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు