సుప్రభాత కవిత ; -బృంద
నిష్క్రమిస్తున్న నిశికి
ఆగమిస్తున్న ఆదిత్యుని
అపురూప వీక్షణలే
అందమైన వీడుకోలు

అంతరంగాన అలసి
నిదురించే అలజడులు
అన్నీ తానై నడిపించి
అందరినీ ఆదరిస్తానంటూ...

మదిలో ఒదిగిన భావాలను
అర్థం చేసుకుని అరచేత పట్టి 
ఇచ్చు అపురూప తాయిలం
ఎదిగివస్తున్న బింబ దర్శనం

మంచి చెడులను గమనించి
ధర్మము తప్పక వెలయించి
నీమము తప్పక కటాక్షించి
కామితమిచ్చే ఋతుకర్తకు

కోరుకున్న ఊహలన్నీ
వాస్తవాలుగా ఎదుటనిలిపి
మనసుకోరే మంచి మార్పేదో
ఏమార్చక  అనుగ్రహించే

జనక్షేమమే ఆకాంక్షగా 
ఏతెంచు కర్మసాక్షికి

🌸🌸సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు