నా జన్మభూమి- ఉదండ్రావు రమణబాబు
కుసుమ ధర్మన్న‌‌‌ కళాపీఠం 
====================
ఎంతో గొప్పది నా జన్మభూమి 
భారతదేశ పౌరుడునైన 
నేను ఎప్పుడూ దేశ సేవలో 
తరిస్తుంటాను మురుస్తుంటాను

నా దేశమంటే నాకెంతో ప్రేమ
నేను పుట్టిన భరతభూమి
చల్లని తల్లి సౌభాగ్య వెల్లి 
మమతలల్లే మాణిక్య వల్లి 

తల్లి నెపుడూ నే వీడి పోను
భరతమాత ముద్దుబిడ్డగా
తల్లి భారతి నీడనే నేను 
సేదతీరుతూ విశ్రమిస్తాను 

జన్మభూమిని మించి ఏముంది 
కన్నతల్లికి సాటి ఏముంది
దవ్వు కొండలు నునుపు అని 
తెలుసుకుని మసలుకుంటా 

దేశోన్నతికై పాటుపడుతూ
నా సర్వస్వము దారబోస్తాను
శత్రుమూకలు ఎదురు వస్తే
ఒక్క దెబ్బకి తరిమివేస్తా

జన్మనిచ్చిన స్వంత గడ్డకు
శిరసు వంచి వినమ్రతతో 
గౌరవించుతూ ప్రణమిల్లుతా 
వీడిపోనని ప్రతిన చేస్తా

కామెంట్‌లు