, మన్యం వైభవం;- కొప్పరపు తాయారు
మడమ తిప్పని మన్యం వీర
మాట తప్పని మహావీర 
ప్రజల కోసం దేశం కోసం 
త్యాగరూపాన సీతారామరాజుగా 

పీరొందిన మన్యంవీర 
 సాయుధ పోరాటమే
సకలమని నమ్మావు 
నమ్మి ప్రాణాలను సైతం 

పణంగా పెట్టి బ్రతుకుని 
త్యాగఫలంగా అర్పించినావు 
ఓ మహావీర అందుకే కాలాలు 
మారిన యుగాలు మారిన 

నిజాయితీ నిజాయితీవే 
నువ్వు నువ్వే శాశ్వతం 
అల్లూరి సీతారామరాజుగా 
అందరి కోసం బాధపడిన
 మహాశక్తివి నీకు నీవే సాటి  !!!


కామెంట్‌లు