1)పాలవాడు వచ్చాడు.
చిక్కటి పాలు తెచ్చాడు.
అక్కకేమొ జలుబు చేసింది.
అమ్మ ఏమొ కషాయం కాచింది.
అక్క తాగి చూసింది .
జలుబు మాయం అని చెప్పింది.
2)పువ్వులచెండు.
విభూతిపండు.
గుమ్మడి పండు గుండ్రం గుండు.
మా తాత తల ఏమొ నున్నని గుండు.
3)గాలిపటము ఎగిరింది.
గుండ్రాణి బొంగరం తిరిగింది.
పొయ్యి మీంద టీ ఏమొ మరిగింది.
ఆకాశంలో మబ్బేమో ఉరిమింది.
4) గడపకు తోరణం కట్టాలి.
తులసికోట దగ్గర దీపం పెట్టాలి.
దేవుడిముందు కొబ్బరి కాయ కేట్టాలి.
బద్దకం వున్న వాళ్ళ పనిపట్టాలి.
5) మెదడుకు పదును పెట్టాలి.
పూలమాలను దారంతో కట్టాలి.
నేలపైన చాపను చుట్టాలి.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి