తేటగీతి పద్యములు
===============
21.
కన్నె గోపిక లెందరో కలలు గనుచు
రాసలీలలనాడగా రాగమతిని
ముక్తి ధామమున్ జూపించు పుణ్యమూర్తి!
నన్నుపాలింపు మాల్యాద్రి నారసింహ!//
22.
మునులు యోగులు సిద్ధులు మురిసి మురిసి
నీదు లీలలన్ భావించి నిష్ఠతోడ
భజన సల్పుచు నుందురు భవ్యహృదయ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
23.
కౌరవమణియా పార్థుని కరము పట్టి
ధర్మపథమును జూపిన దైవమీవె
చెలిమికాడవై చెంతకు చేరబిలిచి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
24.
సంగరంబున పార్థుడు శరణమనుచు
నీదుపాదంబులన్ బట్టి నిగుడుచుండ
గీత బోధల జేసితే కృపనుజూపి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
25.
కృష్ణ!కృష్ణా!యని పలుక కేలు బట్టి
తోడు నీడగా చరియించి దొడ్డతనము
చూపు చుందువు మాధవా!చుట్టరికము
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
===============
21.
కన్నె గోపిక లెందరో కలలు గనుచు
రాసలీలలనాడగా రాగమతిని
ముక్తి ధామమున్ జూపించు పుణ్యమూర్తి!
నన్నుపాలింపు మాల్యాద్రి నారసింహ!//
22.
మునులు యోగులు సిద్ధులు మురిసి మురిసి
నీదు లీలలన్ భావించి నిష్ఠతోడ
భజన సల్పుచు నుందురు భవ్యహృదయ!
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
23.
కౌరవమణియా పార్థుని కరము పట్టి
ధర్మపథమును జూపిన దైవమీవె
చెలిమికాడవై చెంతకు చేరబిలిచి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
24.
సంగరంబున పార్థుడు శరణమనుచు
నీదుపాదంబులన్ బట్టి నిగుడుచుండ
గీత బోధల జేసితే కృపనుజూపి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
25.
కృష్ణ!కృష్ణా!యని పలుక కేలు బట్టి
తోడు నీడగా చరియించి దొడ్డతనము
చూపు చుందువు మాధవా!చుట్టరికము
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి