స్వేచ్ఛ నుంచి ఆధ్యాత్మిక దిశగా చలం;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి)విశాఖపట్నం.
 సనాతన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా
నాటి సమాజాన స్త్రీ పై చూపే వివక్షత
కన్నతండ్రే జన్మనిచ్చిన మాతృమూర్తిని వేధించే సంఘటన.
మూఢ చారాలను చూసి స్త్రీ స్వేచ్ఛకై వ్రాసిన
మైదానం,దైవమిచ్చిన భార్య, ప్రేమలేఖలు
నాటి సమాజంలో  విశృంఖలత్వానికి ప్రతీకలని
సంఘం చే వెలివేయబడి
తుదకు పిల్లనిచ్చిన మామగారు, బంధువులే గాక
ఇంటికి అద్దె ఇవ్వని పరిస్థితులలో
పూరి గుడిసెలో భార్య రంగనాయకితో ఉండి
సంసార జీవితంలోను భార్యతో విబేధాలు ఏర్పడినా
కొడుకు మరణించిన  స్వేచ్ఛా భావాలతో బ్రతుకు బండిని నడిపి
స్త్రీ పురుష సంబంధాలను విప్లవాత్మకంగా వ్రాసి
రొమాన్స్ నా రక్తంలోనే ఉందని ధైర్యంగా చెప్పిన
గుడిపాటి వేంకటాచలం
మీరు మహాకవి శ్రీ శ్రీ మహాప్రస్థానమునకు ముందు మాట వ్రాసిన
స్వేచ్ఛా స్వాతంత్ర్య కవులే..!!.
ఆత్మకథలో ఈశ్వరుడు ఉంటే రూఢిగా నమ్మనాయని
ధర్మం, న్యాయం, సత్యం అనేవి ఉత్త మాయ మాటలైనవి అని
మాట్లాడటానికి స్వేచ్ఛా, శక్తీ ఉన్నవాడే నిజమో అబద్ధమో చెప్పగలడని
కుక్కకి యజమాని ఎంత అవసరమో
ఆడపిల్లకి అంత అవసరం అని
ఏడుస్తున్నా చిన్నపిల్లకి భర్తని కట్టబెడతారని,
భర్త కావలని  గోలపెడుతున్నా వితంతువుకి సంఘం నిరాకరిస్తుందని
సమాజాన్ని నిలదీసిన 
మీరు స్త్రీ స్వేచ్ఛా స్వాతంత్ర్యములకై పోరాడి
జీవిత చరమాంకమున
అరుణాచల రమణుని మాట "నీవెవరు?"అని తెలుసుకుంటే అదే మానవ జీవిత పరమార్ధమని గ్రహించి
స్వేచ్ఛ నుంచి ఆధ్యాత్మికదిశగా మారిన
గుడిపాటి వేంకటాచలం 
మీ కివే నా అక్షర కుసుమాలు.....!!
........................
(మే 19 చలం గారి జయంతి సందర్భంగా)
..............................

కామెంట్‌లు