చిన్నారి గేయాలు.; - జి. విజయ కుమారి
1) అందాల అపరంజి మా అమ్మాయి .            
 నానమ్మ  చేతులు అపరంజిని రారమ్మాన్నాయి.
 గంగిరెద్దులవాడొచ్చి ఊదాడు సన్నాయి.
 మా పొలమంతా ఎద్దులు తిరిగి తరిగి దున్నాయి.

2) సెలీపోన్ మ్రోగింది ట్రింగ్ ట్రింగ్ మని.   
  పాపేమో ఏడిచింది బేర్, బేరమని.      
  నానమ్మెమొ తరిమింది కుఖని హట్ హట్ అని.
తమ్ముడేమొ ఆడుతున్నాడు తూచ్, తూచ్ అని.

3) పెరటిలో మామ్మ మల్లెచెట్టును నాటింది. 
నాటిన చెట్టు వేసవిలో విరగబూసింది.                 
 పుసినపులను అమ్మ కోసింది.
కోసిన పులను మాలను కట్టి కోవెలకు పంపింది.

4) చిక్, చికె రైలు వస్తోంది ఓ పక్క.
చిటపట చినుకులు పడుతున్నాయి ఇంకోపక్క.
 చిన్నారులు కాగితపు పడవలు వేస్తున్నారు మరోపక్క.
 అల్లరిగా గోలగోల చేస్తున్నారు ఆపక్క ఈపక్క.

కామెంట్‌లు