సుప్రభాత కవిత ; బృంద
ఆపలేని వెలుగులన్ని
అవని నిండా నింపేసి
అణువణువూ  చైతన్యం
అనుదినమూ పంచుతూ

ప్రణవమంటి ప్రభాకరుడు
ప్రభాతవేళ  ప్రభవించి
ప్రకాశమంతా ప్రసరింపచేసి
పృధ్విని ప్రభావితం చేసె!

నీమము తప్పక ఏతెంచి
లోకములేలే లోక బాంధవుని
కిరణముల నిచ్చెన వెంట
దిగివచ్చే వేకువ కన్యకు...

కువకువల స్వాగతాలు
గలగలల మంత్రాలు
గుసగుసల  తోరణాలు
ఘుమఘుమల పరిమళాలు

మాయవంటి జీవితాన
మలుపులన్నీ మజిలీలే
ఆగిపోని గమనాలన్నీ
చేరిపోవు తీరాలేవో!

ఆశించినది అందక
అందినవి ఆనక
ఆరాటాలే పోరాటాలై
అలుపెరగక సాగే బ్రతుకులో

ఊహలకు ఊతమిస్తూ
కనులకు కలలిస్తూ
మనసుకు ఊరటనిస్తూ
వస్తున్న వెలుగుల తేరుకు

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు