అందుకే;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 నా కన్రెప్పలకింద
సముద్రాన్ని దాచాను
అందుకేనేమో అక్కడినుండి
జారిన నీరు ఉప్పగాఉంది
నా పిడికెడు గుండెలో
హిమాలయాలను దాచాను
అందుకేనేమో గుండె గొంతులో
అడ్డంపడి మాటలు రావడంలేదు
నా శరీరం ఎండాకాలపు ఎడారిలో ఉన్నట్లుంది
అందుకేనేమో నాలో
తేమ ఇంకిపోయింది
బాధాశప్త తప్తశిశిరంలో 
మోడైన నాజీవనవృక్షం
వసంతంలా నీవు వస్తేనే
మళ్ళీ చిగురిస్తుంది
లేదా...!!!
**************************************

కామెంట్‌లు