కీర్తిస్తున్నా!;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కీర్తిస్తున్నాను నేను
ఆకాశాన్నంటే హిమగిరులను
జీవజలాలనందించే జీవనదులను
మంటినుండి అన్నాన్ని రప్పించే రైతురాజును
తమ దేహసానువుల స్రవించి
చెంగలించే శ్రామికులను
సతతహరితహారాన్ని సృజియించి
భూమాతను అర్చించే రైతుకూలీలను
మన మాతృభూమి రక్షణలో
రుధిరతర్పణంచేసే సైనికులను 
అనారోగ్యపీడితులకు ప్రాణదానం చేసే
వైద్యనారాయణులను
మన మాతృభూమి ఘనకీర్తిని ఖండాంతరాలలో
చాటిచెప్పే కవిగాయక వైతాళికులను
అమృతపూర్ణహస్తాల సద్విద్యాబుధ్ధులను
అందించే గురుపరంపరను
ఆచంద్రతారార్కము మంగళాకాశ సీమాంతములదాక
భరతజనుల కాపాడు భారతాంబను
కీర్తిస్తున్నాను నేను!!
**************************************

కామెంట్‌లు
ఎంతో అద్భుతంగా మనఃపూర్వకముగా
కీర్తించారు సర్.
నమస్సులు.
ఎంతో అద్భుతంగా మనఃపూర్వకముగా
కీర్తించారు సర్.
నమస్సులు.