జపాన్ క్యుషు విశ్వవిద్యాలయం *అంతర్జాతీయ శాంతి సదస్సు లో పాల్గొన్న డాక్టర్ చిటికెన*
  *జపాన్ విశ్వవిద్యాలయ అరుదైన ఆహ్వానం అందుకున్న  ప్రముఖ రచయిత,విమర్శకులు డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్* 
        శాంతి, నిరాయుధీకరణ మరియు పర్యావరణ పరిరక్షణ అంశంగా  క్యుషు విశ్వవిద్యాలయం జపాన్ వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు  తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పలు  జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత ప్రముఖ రచయిత, విమర్శకులు ఇంటర్నేషనల్ బెనెవోలెంట్ రీసెర్చ్ ఫోరం సభ్యులు  డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ కు ఆహ్వానం  విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ డాక్టర్ మాసాహిగో నుండి  అందుకున్నారు. 
        శనివారం  భారతీయ కాలమానం  మధ్యాహ్నం అంతర్జాలంలో ప్రపంచవ్యాప్తంగా  వీడియో విజువల్ గా  కొనసాగిన ఇట్టి కార్యక్రమంలో డా.చిటికెన కిరణ్ కుమార్ హాజరు అయ్యారు. 1945 సంవత్సరంలో నాగసాకి  అణుబాంబు దాడిలో కోల్పోయిన ప్రాణ నష్టాన్ని, హృదయ విధారకమైనటువంటి సంఘటనలు  చూపుతూ వెబినార్ కొనసాగింది. చిటికెన కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిర్వాహకులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గతంలో దక్షిణ కొరియా సియోల్ కు చెందిన హెవెన్లీ కల్చర్ అండ్ వరల్డ్ పీస్ రిస్టోరేషన్ ఆఫ్ లైట్ సంస్థ వారు నిర్వహించిన ప్రపంచశాంతి శిఖరాగ్ర సదస్సు లలో  రెండు సార్లు చిటికెన పాల్గొన్నారు. వివిధ దేశాల నుండి విద్యావేత్తలు, సంస్థ ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.


కామెంట్‌లు