శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
656)అనిర్యేశ్యవపుః -

నిర్వచించుటకు సాధ్యంకానివాడు 
నిర్ధారణ చేయలేనట్టి వాడు 
నిర్దేశించుటకు వీలవనివాడు 
అనిర్యేశ్యవఫుడైనట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
657)విష్ణుః -

భూమ్యాకాశముల్లో నున్నవాడు 
అంతటా వ్యాపించినట్టి వాడు 
వైకుంఠంలో నివసించేవాడు 
విష్ణుస్వరూపమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
658)వీరః -

వీ ధాతువుచే నిండినట్టి వాడు 
కర్మలను కలిగియున్నవాడు 
వీరత్వము సూచింపబడువాడు 
విజయకారణమై వెలుగువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
659)అనంతః -

సర్వత్రా యుండునట్టివాడు 
సర్వకాలములలో నున్నవాడు 
అంతములేనివిధమున్నవాడు 
అనంతుడయి రాజిల్లువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
660)ధనంజయః -

ధనమును జయించినట్టి వాడు 
సంపదను గెలుచుచున్నవాడు 
శ్రీలను ఓడించగలవాడు 
ధనంజయనామమున్న వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు