జోహార్;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

మంచు నిప్పుల్లో

ఎడారి సెగల్లో

నింగే హద్దుగా తిరిగే గాలుల్లో

భూగర్భందాకా ఉండే సముద్రజలాల్లో

గహనాంతర వనాల్లో,జనాల్లో

పంచభూతాలనంటిపెట్టుకొని

నీ పంచప్రాణాలను ఫణంగా పెట్టి

భారతాంబ శోకాశ్రుపుష్పశకలాలను తూడ్చేపనిలో

ఉల్లాసంగా, ఉత్సాహంగా,ఉద్వేగంగా,ఉగ్రంగా

సాలోచనతో, సానుకూలంగా

శ్రమించి,గమించి,ఉద్యమించి

మాతృభూమి రక్షణకై పరితపించి

పరిక్రమించి,పరిశ్రమించి,పరిభ్రమించి

క్షణంవిశ్రమించక, క్షణంవిలంబించక, క్షణంఆలోచించక

శతృమూకల తోకల,కుత్తుకల నుత్తరించి

దేశ సరిహద్దు ఆవలివరకూ తరిమికొట్టి బుధ్ధిచెప్పి

భారతదేశాన్ని నిశ్చింతగా,నిరపాయంగా ఉండేలా

సదా రక్షించే ఓ మా వీర రక్షక సైనికా!

నీకిదే మా శిరసా పాదాభివందనం!

భారతసైనికా జోహార్! జోహార్ !!!

**************************************

కామెంట్‌లు