నీవు వచ్చినా రాకపోయినా
నాకళ్ళకు కన్నీరయితే వచ్చింది
నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా
నాగుండెను మండించావు
మొదటిసారి నిన్ను
నేను గవాక్షదర్శనం చేశా
సూర్యకాంతి వంటి ముఖవర్ఛస్సుతో
ఆమని విరిసిన ముంగురులతో
మత్తుకలిగించే నీరూపం
అందాలకే అందాన్ని ప్రదర్శించింది
నీవు నన్ను చూసినా చూడకున్నా
నీవు మాత్రం నాగుండెలోతులో నెలకొన్న
నీరవ నిశీధిలోని ఒక మెరుపయ్యావు
నీవు నాకు నీహృదయం
ఇచ్చినా ఇవ్వకపోయినా
నాగుండెకు గాయమైతే చేశావు సుమా!
************************************
నాకళ్ళకు కన్నీరయితే వచ్చింది
నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా
నాగుండెను మండించావు
మొదటిసారి నిన్ను
నేను గవాక్షదర్శనం చేశా
సూర్యకాంతి వంటి ముఖవర్ఛస్సుతో
ఆమని విరిసిన ముంగురులతో
మత్తుకలిగించే నీరూపం
అందాలకే అందాన్ని ప్రదర్శించింది
నీవు నన్ను చూసినా చూడకున్నా
నీవు మాత్రం నాగుండెలోతులో నెలకొన్న
నీరవ నిశీధిలోని ఒక మెరుపయ్యావు
నీవు నాకు నీహృదయం
ఇచ్చినా ఇవ్వకపోయినా
నాగుండెకు గాయమైతే చేశావు సుమా!
************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి