కవనప్రకృతి;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఏ ఋతువు
అనుకూలిస్తుందో
ఏ సమయము
అనుగ్రహిస్తుందో

ఏ విత్తనం
మొలుస్తుందో
ఏ అక్షరం
గెలుస్తుందో

ఏ మొక్క
ఎదుగుతుందో
ఏ పదం
ఎదనుతడుతుందో

ఏ కొమ్మ
పూస్తుందో
ఏ పంక్తి
పులకరిస్తుందో

ఏ పిందె
కాయవుతుందో
ఏ చరణం
శ్రావ్యమవుతుందో

ఏ పండు
ఊరిస్తుందో
ఏ కవిత
మురిపిస్తుందో

ఏ గాలి
సౌరభాలనువీస్తుందో
ఏ ఊహ
తియ్యదనాలనుపంచుతుందో

ఏ వనం
అందాలనుచూపుతుందో
ఏ పుస్తకం
ఆనందాలనిస్తుందో

అరణ్యంలో
సేదతీరుదాం
సాహిత్యంలో
మునిగితేలుదాం

కళ్ళకు
విందునిద్దాం
మెదళ్ళకు
మేతపెడదాం

ప్రకృతిని
ప్రేమిద్దాం
పలుకులమ్మని
పూజిద్దాం


కామెంట్‌లు