నల్లని వనం!!; - డా.ప్రతాప్ కౌటిళ్యా
ధవళ వర్ణ బిలాల్లో దళపతులు ఆహుతి
త్రివర్ణ పతాకం రెప్పల్లో అఖండ జ్యోతి జాగృతం.

కుడి ఎడమల కావడికుండలు మోస్తున్న నాభిని చీల్చుకుని జనించిన పారాణి
నిశిది లో వీధి వీధి తీర్చిదిద్దిన పొద్దు అది.

తిరగబడ్డ శబ్దం ప్రతిధ్వనిస్తూ ప్రపంచ గతిని మారు మ్రోగిస్తూ శంఖం పూరించి ఎంతో సమయం కాలేదు.

నీలాకాశం మహాసముద్రాన్ని మాంత్రికుని చేసి జడివాన మర్రి ఊడల్లా నాటుకుంటున్న
తలాన్ని నదులన్నీ ఎదురెక్కి పారుతున్నాయి.

విభూతి పద్యం భరణిలో సుడిగుండాలు మొదలైనవి
నిలువు అడ్డనామాల లెక్కలు కుంకుమ తిలకాలు తేల్చుకుంటాయేమో.

అనంత లోతుల్లో చిక్కుకున్న నీటి చెలిమే ఒకటి
ఆకాశం కేసి దూసుకు వస్తుంది.
నిరంతరం నిర్బంధించబడ్డ స్వర్గం స్వర్గస్తురాలు కాకముందే త్రిశంకు స్వర్గం తీర్పు చెప్తుంది ఇప్పుడు.

మేల్కొన్న పాల కలశం ఉప్పొంగే సమయాన అపురూప అనుభూతి శతాబ్దాలనాటి శతఘ్నల్నీ పేల్చినట్లు నిశ్శబ్దం ఒప్పుకుంది.

అక్కడ రెండు నేత్రాలు ప్రతిష్టించిన వెలుగునీడల విగ్రహాలు రంగురంగుల కాంతి తోటల్లో ప్రసవించిన సీతాకోచిలుకలు.
రేపటి స్వప్నంలో నిజరూపం పొందే నిజాలు అవి.

తలనీలాల నక్షత్రాలు రాలిపోవడం లేదు మొలుస్తున్నవి
ఈ సరికి అదో సుందర నల్లని వనం.
ఎంతటి కాంతి నైనా మింగే కాంతా అది.

తెల్లని పావురంలా సమాచారాన్ని తెచ్చి ఇచ్చే
కోటానుకోట్ల కాంతి సంవత్సరాల తెల్లని రంగు ఒకటి దాని మిత్రురాలు.

Dr. pratapkoutilya 🙏

కామెంట్‌లు