శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
681)స్తోత్రం -

స్తోత్రముల రూపములో వున్నవాడు 
కీర్తనై రచింపబడినట్టి వాడు 
మహిమాక్షరములుగా నున్నవాడు 
దేవత్వము శబ్దించుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
682)స్తుతిః -

స్తవనక్రియ తానైనట్టివాడు 
కీర్తనముగా ధ్వనించుచున్నవాడు 
గానముతో రాజిల్లుచున్నవాడు 
భజనరూపములోన యున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
683)స్తోతా-

స్తుతించు ప్రాణి తానేయైనవాడు 
పొగడిక చేయుచున్నట్టివాడు 
స్తోతగా పరిణమించువాడు 
వేదములు పఠిoచుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
684)రణప్రియః -

యుద్ధప్రీతి కలిగినట్టివాడు 
పోరుకు ఆసక్తిగలిగినవాడు 
పౌరుషము చూపించగలవాడు 
రణస్ఫూర్తి గలిగియున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
685)పూర్ణః -

సర్వమూ తానే అయినట్టివాడు 
పూర్ణస్వరూపము కలిగినవాడు 
దివ్యత్వము నిండినట్టివాడు 
శక్తిపూర్ణత్వము పొందినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు