ఏమి చోద్యమో!;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రాత్రయితేచాలు
అదేయావ
పవ్వళిస్తేచాలు
అదేధ్యాస

అలసిన తనువు
నిద్రనుకోరుకుంటుంది
వేడెక్కిన మనసు
విశ్రాంతినడుగుతుంది

కళ్ళుమూస్తేచాలు
నిదురవస్తుంది
పడుకుంటేచాలు
కలవస్తుంది

స్వప్నమొస్తేచాలు
మెలుకువవస్తుంది
మేలుకుంటేచాలు
ఆలోచనలొస్తున్నాయి

కల్పనలు
చుట్టుముడుతున్నాయి
కవ్వింపులు
వెంటబడుతున్నాయి

నిజాలు
మరుగునపడుతున్నాయి
రంగులు
పులమమంటున్నాయి

భ్రమలు
కలుగుతున్నాయి
కోర్కెలు
జనిస్తున్నాయి

చక్కదనాలు
కనువిందుచేస్తున్నాయి
శ్రావ్యరాగాలు
వీనులవిందునిస్తున్నాయి

అక్షరాలు
అలుముకుంటున్నాయి
పదాలు
పొసుగుతున్నాయి

కలాలు
కదులుతున్నాయి
కాగితాలు
నిండుతున్నాయి

కలసి
కవితలు వెలుగులోకొస్తున్నాయి
చదివి
మనసులు మురిసిపోతున్నాయి

పగలు
పరుగెత్తుకుంటువచ్చింది
చీకటిని
సుదూరంతరిమేసింది

కల
మదులముట్టింది
కైత
తనువులతట్టింది

కవికి
ఖ్యాతి కూరింది
కవితకి
కీర్తి వచ్చింది

ఏమి చోద్యమో ఏమో
కలలోవచ్చింది
కవితలో దూరుతుంది
కవితలోదూరింది
మదులలోదూరుతుంది


కామెంట్‌లు