వైద్య ఖర్చుల పట్ల ప్రభుత్వం నియంత్రణ ఆవశ్యకతసి.హెచ్.ప్రతాప్

 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్  మెడికల్ రీసెర్చ్ ప్రకారం, ప్రతి సంవత్సరం పది లక్షల కంటే ఎక్కువ సంఖ్యలో కొత్త క్యాన్సర్ రోగులు భారతదేశంలో గుర్తించబడతారు. ఠె ళంచెత్ ప్రచురించిన మరొక అధ్యయనం ప్రకారం గుండె సంబంధిత అనారోగ్యాల వలన కలిగే మరణాల సంఖ్య భారతదేశంలోని పట్టణాల కంటే గ్రామీణ ప్రదేశాలలో ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి గుండె వ్యాధులు వంటి కొన్ని ప్రాణాంతక వ్యాధులకు గురయ్యే అవకాశాన్ని తగ్గించగలదు, అయితే క్యాన్సర్ వంటి ఇతర వ్యాధులను ఊహించలేము. గతంలో ఒక వ్యక్తికి అటువంటి వ్యాధులు సోకే అవకాశాలు తక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు మరియు మరెన్నో తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తి గురించి మరింత తరచుగా వింటున్నాము. అంతేకాకుండా, ఈ తీవ్రమైన అనారోగ్యాల చికిత్స కోసం అయ్యే ఖర్చులు వేగంగా పెరుగుతున్నాయి మరియు మీకు మరియు మీ కుటుంబానికి తీవ్రమైన ఆర్థిక భారం కలిగించవచ్చుదేశంలో నానాటికీ పెరుగుతున్న వైద్యం ఖర్చులపట్ల సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ వైద్యం పేరిట జరిగే వ్యాపారానికి కళ్ళెం వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ నేపధ్యంలో ఆస్పత్రి ఫీజులు అందుబాటులో ఉండే విధంగా క్లినికల్‌ ఎస్టాబ్లిష్మెంట్‌  నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం శుభపరిణామం.కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకంలో పేర్కొన్న ప్రామాణిక ఫీజులను అమలు చేసేందుకు తగు నియమ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం 14 ఏళ్ల క్రితం రూపొందించిఇంది. వివిధ వైద్య చికిత్సలు, పద్ధతులు, ప్రక్రియ లకు నిర్దిష్ట ఫీజులను నిర్ధారించాలని, ఫీజులను నిర్ణయించే ముందు ప్రజల జీవన ప్రమా ణాలను, ఇతర స్థితిగతులను దృష్టిలో ఉంచుకోవాలని కేంద్రం అప్పట్లో ఈ నిబంధనలను రూపొందించడం జరిగింది. అయితే, దేశంలోని కార్పొరేట్‌ ఆస్పత్రులేవీ ఈ నిబంధనలను పాటించడం లేదు .కార్పొరేట్‌ ఆస్పత్రులు తమకు తోచిన విధంగా ఫీజులు వసూలు చేయడమే కాదు చికిత్సలకు చెల్లించాల్సిన ఫీజులు సామాన్యులకు ఏమాత్రం అందుబాటులో ఉండడం లేదనే విషయం కూడా అందరికీ తెలిసిందే.ఆరోగ్యంపై పెరుగుతున్న వ్యయం కారణంగా ప్రతి సంవత్సరం 8-9 శాతం మంది ప్రజలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు.ప్రభుత్వం ఏదైనా కఠినమైన నిబంధనలను రూపొందించినట్లయితే ఆరోగ్య సంరక్షణలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఈ నేపధ్యంలో దేశంలో పెరుగుతున్న వైద్యం ఖర్చులను నియంత్రించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.   
కామెంట్‌లు