స్వదేశంలో జీవనం;-పోలూరి విజయ శ్రీ.నరసరావు పేట

 కుసుమ ధర్మన్న కళాపీఠం
====================
రచన:పోలాలమ్మి, స్తలాలమ్మి, పొరుగూర్లకు,పనికి పోయి కష్టపడి చదివించ నా బిడ్డలను
ప్రపంచాన్ని దాటి పెద్ద పెద్ద కంపెనీల జేరి లక్షలు సంపాదించు లక్షణంగా బ్రతుకు 
 అని ఆశించు తల్లి.
జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరియసి
అను చందము నాది
ఆనందముగా నా నేలను సేద్యం చేసేద నా మల్లి
డాలర్లకు పొంగిపోకు ధాన్యం పండిస్తా నేను
ఉన్న ఊరు కన్న తల్లీ ఒక్క రూపన్న రీతీ
కన్న తల్లీ ఒడి వీడి ధైది పాలకెగబడదు.... ఈ సాదిక్ మది
దూరపు కొండలు నునుపు మిము విడితే మీ తలరాతలే నలుపు
విదేశాల జాబులని వీర్ర వీగు యువత
మీ జాబులందనివే మా భవిత
కలసి బ్రతుకుదాం కలో గంజో తాగుదం
స్వార్థానికి నిదర్శనం విదేశాలలో జీవనం
నిశ్వర్ధానికి ప్రదర్శనం 
స్వదేశ జీవనం ఆనంద ప్రదర్శితం
సొంత గడ్డపై కౌలు రైతుల బ్రతుకు ధన్యం
విదేశాలలో ఉద్యోగం జైలుశిక్షతో సామాన్యం
ప్రతివారు ఉండాలి స్వదేశంలో
ప్రతి యువకుడు కలుసుండాలి మాత పితరులతో
అపుడే స్వర్గం దీవిలో ఉండదు
అపుడే ఉండవు అనాథ శరణాలయాలు
అపుడే ఉండవు వృద్దస్రమాలు
అపుడే ఉండవు అనాథ శవాల దహన కాండలు
జై జవాన్
జై కిసాన్
జై జన్మ భూమి.
కామెంట్‌లు
Sasha brahmam చెప్పారు…
చాల అర్థవంతమైన, అద్భుత కవిత. విజయ గారికి ధన్యవాదాలు.