శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
731)తత్ -

వ్యాపించియున్నట్టి దైనవాడు 
దైవయోగము అయినవాడు 
ముక్తి ఏదో అదే అయినవాడు 
దివ్యభావన కలిగించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
732)పదం -అనుత్తమః -

ముముక్షువులు కోరుకొనువాడు 
ఉత్తమ స్థితి తానయినవాడు 
మోక్షమార్గం తెలుపగలవాడు 
పూర్ణ పథము చేర్చగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
733)లోకబంధుః -

లోకముకు చుట్టముగా నున్నవాడు 
జన యోగక్షేమములు చూచువాడు 
భక్తులకు ఆశ్రయం ఇచ్చువాడు 
విశ్వబంధువు అయినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా
734)లోకనాథః -

లోకానికి ప్రభువుగా నున్నవాడు 
విశ్వమంతటికీ పరిపాలకుడు 
జీవులకు నాథునిగా నున్నవాడు 
ప్రాణులను నడిపించున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
735)మాధవః -

మౌనముతో గ్రహించలేనివాడు 
ధ్యానంవలన లభించనివాడు 
యోగముతో కనుగొనలేనివాడు 
మాధవ నామమున్నట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )శ్రీ విష్ణు సహస్రనామాలు 
ఎం. వి. ఉమాదేవి 
(బాల పంచపది )-20-5 -2024

731)తత్ -

వ్యాపించియున్నట్టి దైనవాడు 
దైవయోగము అయినవాడు 
ముక్తి ఏదో అదే అయినవాడు 
దివ్యభావన కలిగించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
732)పదం -అనుత్తమః -

ముముక్షువులు కోరుకొనువాడు 
ఉత్తమ స్థితి తానయినవాడు 
మోక్షమార్గం తెలుపగలవాడు 
పూర్ణ పథము చేర్చగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
733)లోకబంధుః -

లోకముకు చుట్టముగా నున్నవాడు 
జన యోగక్షేమములు చూచువాడు 
భక్తులకు ఆశ్రయం ఇచ్చువాడు 
విశ్వబంధువు అయినవాడు 

శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా
734)లోకనాథః -

లోకానికి ప్రభువుగా నున్నవాడు 
విశ్వమంతటికీ పరిపాలకుడు 
జీవులకు నాథునిగా నున్నవాడు 
ప్రాణులను నడిపించున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
735)మాధవః -

మౌనముతో గ్రహించలేనివాడు 
ధ్యానంవలన లభించనివాడు 
యోగముతో కనుగొనలేనివాడు 
మాధవ నామమున్నట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు