శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
651)కామదేవః -

చతుర్విధ పురుషార్థా లిడువాడు 
భక్తులకోరికలు తీర్చువాడు 
ఆర్తులతో పూజింపబడువాడు 
కామ్యార్థులకు దేవుడైనవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
652)కామ్యపాలః -

వరములు లభింపజేయువాడు 
అనుకూలముగా నుండేవాడు 
కోరికలు సిద్ధింపజేయువాడు 
కామ్యపాలనము జేయగలవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
653)కామీ -

సకలాభీష్టములనూ తీర్చువాడు 
సర్వకోరికలు సిద్ధించినవాడు 
కామ్యఫలములు అందించువాడు 
భక్తులకు సదా కామ్య సులభుడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
654)కాంతా-

రమణీయ రూపమున్నట్టివాడు 
మోహినీ అవతారములోనివాడు 
సమ్మోహనరూపులోని వాడు 
లాలిత్యమైన దేహమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
655)కృతాగమః -

ఆగామ శాస్త్రాలనందించినవాడు 
శ్రుతి,స్త్రుతిలను రచించినవాడు 
వేదములు ప్రసాదించినవాడు 
కృతాగముడై యున్నట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు