నిర్ణయం;- ఏడుకొండలు ఈతకోట -సూళ్లూరుపేట
కుసుమ ధర్మన్న కళాపీఠం 
====================
కన్న బిడ్డకు ఉన్నత విద్య నేర్పించి విదేశాల్లో ఉన్నత స్థానంలో చూడాలన్నది తల్లి ప్రేమ

విదేశాలలో ఉన్నత విద్య చదివించే ఆర్ధిక స్తోమత లేని నిస్సహాయ  తండ్రి

కంటికి రెప్పలా కనిపెంచిన తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలనే కొడుకు 

ముగ్గురి ఆలోచనల్లో అర్థం ఉంది 
కన్న బిడ్డల గురించి తల్లిదండ్రులు 
కన్నవారి గురించి కన్న బిడ్డలు 
చూపే ఆలోచనా ధోరణి అమోఘమే 

కండలు కరిగేలా కష్టించి బిడ్డలను పోషించిన అమ్మానాన్నలను 

ధన వ్యామోహంతో
జన్మించిన ధరిత్రిని
జన్మనిచ్చిన కన్నవాళ్ళను వదిలి 

అన్ని బంధాలకు దూరంగా వెళ్లి 
ఒంటరిగా ఏకాకిలా ధన దాహం తీర్చుకోవడం

కళ్ళ ముందు బిడ్డలు కానరాక ఆప్యాయతలు పంచుకోలేక అలమటించేను తల్లిదండ్రులు

దూరపు కొండలు నునుపు అన్నట్టుగా 
అదుపు లేని ఆశలతో మాతృదేశాన్ని వదిలిపోవడం కన్నా  

అన్ని అవకాశాలు ఉన్న మన జన్మభూమిలోనే ఉంటూ 
కన్నవారి కన్నులలో ఆనందం చూస్తూ 

ఆఖరి దశలో అమ్మానాన్నలకు తోడుగా ఉంటూ 
కంటికి రెప్పలా కాపాడుకుంటూ 

కన్నవారి రుణం తీర్చుకోవాలనే కొడుకు ఆశయం నిర్ణయం చాలా గొప్పది

కామెంట్‌లు