ఆలుగడ్డ ఉపయోగాలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 మనందరికీ ముఖ్యంగా పిల్లలకు ఆలుగడ్డ అంటే భలే ఇష్టం కదూ!? వేపుడు కూర చపాతీలో దోసెల్లో కూడా రుచి.కుక్షినింపుకోటమే కాదు దానితో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అని అమ్మ చెప్పగానే శివ విజి రెడీగా ఆలుగడ్డలు శుభ్రంగా కడిగి ఉంచారు.సెలవుల్లో అమ్మ కి వంటలో సాయం చేస్తూ ఉంటారు.చర్మరోగాలు పోగొట్టి కాంతిని ఇస్తుంది.కంటిచుట్టూ డార్క్ నల్ల వలయాలు పోవాలంటే పచ్చి ఆలుగడ్డ ముక్కతో రుద్దాలి.ఇంటి వస్తువులు క్లీన్ చేయొచ్చు.కత్తి చాకు కి చిలుముపడితే ఓ10 నిముషాలు ఆలూతో బాగా రుద్ది కాసేపైనాక మంచి నీటి తో శుభ్రం చేయాలి.కార్పెట్ పై మరకలు టమాటా రసం సాంబారు పడితే ఆమరక ఉన్న ంతమేర బాగా రుద్ది నీటితో గంటతర్వాత కడగాలి.ఇంటి గాజుకిటికీలు అద్దాలు పాత్రలు ఆలుగడ్డ ముక్కతో బాగా రుద్దాలి.ఆపై పొడి గుడ్డతో తుడవాలి.తోలు చెప్పులు సంచులు మురికి వదలాలి అంటే అరగంట రుద్ది ఆపై తడిగుడ్డతో తుడవాలి.భాండీ కూర అన్నం గిన్నె మాడితే ఆలుగడ్డ ముక్కను నిమ్మరసం తో కలిపి మాడిన చోట ఉంచి ఆపై బాగా రుద్దాలి.ఉడికించిన ఆలుగడ్డ నీటిలో నల్లగా మారిన వెండి సామాన్లు వేసి కాసేపు ఉంచితే మెరుస్తాయి.ఉప్పు వెనిగర్ పచ్చిఆలుగడ్డ గుజ్జు కల్పి చెక్క సామాన్ల పై బాగా రుద్దాక మెత్తని పొడి గుడ్డతో తుడిస్తే కొత్త ఫర్నిచర్ సిద్ధం.
ఇవన్నీ తెలుసుకున్న పిల్లలు బడిలో ప్రయోగాలు చేసి చూపాలి అని నిర్ధారించుకున్నారు🌹

కామెంట్‌లు