శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
636)విశుద్ధాత్మా -

పరిశుద్ధమైన ఆత్మగలవాడు 
స్వచ్ఛ మనోరథమున్నవాడు 
భక్తులకు నిర్మలత్వమిచ్చువాడు 
విశుద్ధభావనలున్నట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
637)విశోధనః -

తనను స్మరించువార్నిగాచువాడు 
పాపనాశనము చేయగలవాడు 
సమస్యలు పరిష్కరించువాడు 
ఆత్మశోధనము గలిగించువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
638)అనిరుద్ధః -

శత్రువులడ్డగింపని వాడు 
ఆటంకము ఎరుగనట్టి వాడు 
అనిరుద్ధ  నామధేయుడు 
ప్రత్యర్థులు ఎరుగనివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
639)అప్రతి రథః -

తననెదుర్కొనువారు లేనివాడు 
ప్రతిపక్షము లేనట్టివాడు 
శత్రువులనువారు లేనివాడు 
వ్యతిరేకులు యుండనివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
640)ప్రద్యుమ్నః -

విశేషమైన ధనమున్నవాడు 
తన అంశలను పంచువాడు 
మన్మధునిరూపమున్నట్టివాడు 
ప్రద్యుమ్న నామమున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు