మురిపం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 తన ఆశలు ఆశయాలకు నీళ్ళొదులుకుని
తన కలల్ని కోరికల్ని పాతరేసి
తన వంశాంకురాన్ని పెంచి పెద్దజేసి
వాడిపాదాలకు తన అరచేతులపాదరక్షై
వాడిఆనందాన్ని తన కళ్ళల్లోనింపుకుని
సంతోషపు అలలమీద ఊయలూగుతాడు
తనఒడినే బడిగా,తనభుజాలే సింహాసనంగా చేసి
సంతోషపు చెమటచుక్కైరాలి
పురివిప్పిన నెమలిలా ఆడుతాడు
తాను చీకటిలోనడిచినా
తనవాడికి వెలుగుచూపే దివిటీఅయి
తాను చిరిగినచొక్కా అయినా
తనవాడికలంలో సిరాచుక్కై
తన ఉగాదులుఉషస్సులను తనవాడికిధారపోసి
తనకుతాను సంతోషంగా తనవాడికి పెన్నిధై
తానే తనవాడికి పూర్తికాలపు రక్షణకవచమై
తన తుదిశ్వాసవరకు తనశ్వాస తనవాడే అనుకుంటూ
మంటిలోకలిసిపోతూ మింటిలోచుక్కై నిలబడి
మురిసిపోతూ తనవాడిని అపురూపంగా చూసుకుంటాడు
తనవాడి విజయాలను ఆకాంక్షిస్తూనే ఉంటాడు!!
**************************************


కామెంట్‌లు