చిరునవ్వుకోసం;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
చిరునవ్వుకోసం
సిగ్గూశరమూవదిలి
చిన్నదాన్నడిగా

ముద్దడగలా
ముచ్చటడగలా
మంచినవ్వడిగా

అన్నమడగలా
మంచినీళ్ళడగలా
అద్భుతమైననవ్వునడిగా

సరసాలాడమనలా
చిందులేయమనలా
చిన్ననవ్వునడిగా

కాఫీనడగలా
తేనీరడగలా
చిరునవ్వునడిగా

అందాన్నడగలా
ఆనందాన్నడగలా
అపరూపమైననవ్వునడిగా

ఆటనాడమనలా
పాటపాడమనలా
తేటయిననవ్వునడిగా

ఉలకమనలా
పలకమనలా
కళకళాడమన్నా

దానముకోరలా
సాయముకోరలా
చిన్నినవ్వునడిగా

చేతులుకలపమనలా
సోకులుచూపమనలా
చిట్టినవ్వునడిగా

విందునడగలా
పొందునడగలా
పసందైననవ్వడిగా

కళ్ళనుకట్టేయమన్నా
మదినిముట్టమన్నా
నవ్వుల్లోముంచమన్నా


కామెంట్‌లు