నీరే జీవనాధారం;సి.హెచ్.ప్రతాప్
 గాలి తర్వాత జీవకోటికి నీరు అత్యంత అవసరమైన ప్రకృతి వనరు. పంచ భూతాల్లో ప్రధానమైనది. మానవ మనుగడ, భూగోళంపై ప్రాణకోటి వృద్ధికి జలమే ఆధారం. ఇప్పుడు మనం చేస్తున్న తప్పులే మనకు నీటి వనరులను దూరం చేస్తున్నాయి. ప్రతిబొట్టునూ ఒడిసిపట్టి భవిష్యత్‌ తరాలకు అందించాల్సిన అవసరమున్నది. లేదంటే మానవ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముంది. భారత్ లో సుమారు 50 శాతం కంటే తక్కువ మందికి మాత్రమే సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉందని యూనిసెఫ్ చేసిన అధ్యయనంలో తేలింది. అందుకే ప్రతి ఏడాది ఈ రోజు అంటే మార్చి 22న అంతర్జాతీయ జల దినోత్సవం జరుపుకుంటున్నాం ప్ర. పంచంలో నీరు 70 శాతం అని, దానిలో మంచినీరు 3 శాతం అని, అందువలన భవిష్యత్ తరాల కోసం నీటిని పొదుపు చేయవలిసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఐక్యరాజ్య సమితి ప్రపంచ దేసాలను హెచ్చరించింది.. నీరే మానవునికి జీవనాధారం అని, నీరు లేకపోతే మనిషి మనుగడే లేదని ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి.
నీరు సకల జనులు, సకల జీవరాశులకు ప్రాణా ధారం వర్షం. సముద్రాలు, నదులు, చెరువులు, కుంటలు, కాల్వల ద్వారా మనకు నీరు దొరు కుతుంది. అపరమయిన వనరుగా ఉన్న నీరు ఇపు డు దొరకడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చెరువులు కుంటలు పూర్తిగా మట్టి నిండిపోయినవి దీంతో అడపాదడపాగా వచ్చిన వర్షాల వల్ల నీరు నిల్వ ఉండలేకపోతుంది.  దీంతో తరచుగా నీటి కొరత ఏర్పడటం తో తాగునీరు దొరకడం కష్టతరంగా మారింది. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవడంతో చెరువులు కుంటలు అన్యాక్రాం తనికి గురవుతున్నాయి.చెరువులు కుంటల్లో పూడికలు చేరి నీటి శాతం దిన దినంగా అడుగంటిపోతున్నాయి. వీటికి నీరందించే కాల్వలు నాలాల్లోను పూడికలు ఏర్పడి నీరు అందడం లేదు.. అలాగే గ్రామాల్లో భూగర్భజలాలు క్రమేపీ తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వేగంగా పెరుగుతున్న పట్టణీకరణకు తోడు అధికారుల నిర్లక్ష్య వైఖరి వలన చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరులు దురాక్రమణకు గురవుతున్నాయి. ఫలితంగా కొద్దిపాటి వర్షాలకే నగరాలు, పట్టణాలను వరదలు ముంచెత్తుతున్నాయి .ప్రకృతి కాపాడుటకు వాతావరణ సమతుల్యతకు, పచ్చదనానికి, పరిశుభ్రతకు, చల్లదనానికి ఊతమిచ్చే జలాశయాలు చెరువలు కుంటలు సమాజానికి ఎంఒతో మేలు చేస్తాయన్న విషయాన్ని పాలకులు గుర్తించకపోవడమే ప్రధాన కారణం .చెరువులు కుంటలు పరిరక్షణకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి మన చెరువుల, కుంటలు మనమే పరిరక్షించుకోవాలి. చెరువులు, కుంటలు కనుమరుగైపోతే మానవ జీవితమే సమాప్తం.  

కామెంట్‌లు