శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి

776)దురతిక్రమః -

అతిక్రమింప రానట్టివాడు 
పరులు శాశించజాలనివాడు 
ఎవరికిని అంతుపట్టనివాడు 
దురతిక్రమ నామమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
777)దుర్లభః -

తేలికగా లభ్యమవనివాడు 
అనుభవము కానట్టివాడు 
దర్శనమే దొరకజాలని వాడు 
స్వామి దుర్లభుడై యున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
778)దుర్గమః -

క్లిష్టముగా లభించునట్టివాడు 
ఎరుకలేనట్టి శక్తి యైనవాడు 
చేరుటకు మార్గం సరిలేనివాడు 
స్వామి దుర్గమమైనట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
779)దుర్గః -

భక్తసులభుడు కానట్టివాడు 
అందరికినీ దొరకానట్టివాడు 
పట్టుకొన శక్యము గానివాడు 
దుర్గమమైన సాయుజ్యమిచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
780)దురావాసః -

మదిలో నిల్ప దుర్లభమైనవాడు 
యోగులకును అందనివాడు 
భక్తజనులకసాధ్యమైనవాడు 
దురావాసకుడై యున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు