స్ఫూర్తి దాతలు! అచ్యుతుని రాజ్యశ్రీ
 " సెలవలు ఐపోవస్తున్నాయి. మీరు చదివిన విషయాలను కొన్ని నాకు చెప్పండి" తాత ప్రశ్న కి " పుస్తకాలు పేపర్లు చదివి కొందర్ని గూర్చి టూకీగా నోట్బుక్ లో రాశానుతాతా!" అని శివా ఆనోట్స్ తెచ్చాడు." ఈమె పేరు సోనాల్ గోయల్.ఎల్.ఎల్.బి.చేసి ఐ.ఎ.ఎస్ ఆఫీసర్ అయింది ఆమె." నేను జనరల్ స్టడీస్ లో తక్కువగా మార్కులు రావడంతో ఇంటర్వ్యూ లో సెలెక్ట్ కాలేదు.ఢిల్లీ యూనివర్సిటీ లో ఎల్.ఎల్.బి. 
సి.ఎస్.కంపెనీలోసెక్రటరీ గా పార్ట్ టైం జాబ్ చేస్తూ సిలబస్ పూర్తి చేశాను.రెండోసారియు.పి.ఎస్.సి. పరీక్ష పాస్ అవటమే కాకుండా మంచి మార్కులు జనరల్ స్టడీస్ లో మంచి మార్కులు వచ్చాయి."
ఇక కాన్సర్ బారిన పడిన కనికాటెకరీవాల్ మనదేశంలో పెద్ద జెట్ కంపెనీ జెట్ సెటగో లో తన ప్రతిభను చాటుకున్నారు.33ఏళ్ల ఈమె కఇ10 కన్నా ఎక్కువ ప్రైవేటు జెట్స్ ఉన్నాయి.ఈమె దానికి ఫౌండర్ సి.ఇ.వో.కూడా.చాలా సాంప్రదాయ మార్వాడీకుటుంబంలో పుట్టి పెరిగిన కనికాతండ్రికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది.22 వ ఏటనే తన ఫ్రెండ్ సుధీర్ పెర్లాతో కల్సి కంపెనీ ప్రారంభించారు.ఇందులో ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ లాండింగ్ ఏర్ క్రాఫ్ట్ ఉపయోగిస్తారు. ఈమె మొదలుపెట్టిన స్టార్టప్ వల్ల జనాలకి లాభం.కమీషన్ ఎక్కువ ఇవ్వాల్సిన పనిలేదు.దేశంలోనే తొలి సారిగా ఆమె స్టార్టప్ పేరు ఊపు అందుకుంది.ఆమెపేరు ఫోర్బ్స్ లో చోటు చేసుకుంది 🌸

కామెంట్‌లు