పచ్చని ఆకు!!!; - Dr.ప్రతాప్ కౌటిళ్యా
జారిపోతున్న కాలాన్ని పట్టుకునే ప్రయత్నమే జీవితం.
రాలిపోతున్న ఆకు మౌనమే జీవిత సత్యం.

నడక నేర్పిన నది ఆగిపోయిన చోటే పచ్చని పంటలు.
ఎదురేకి ఆహ్వానించిన పైరగాలి కైలాసం ఇప్పుడు.

గడ్డి పరక గర్భం ధరిస్తేనే లోకం ఆకలి
కొనదు
ఆంతర్యం తెలుసుకున్న గింజలు అవతార పురుషులు ఇప్పుడు.

నేల నెర్రెలు బారిన మేఘం కిందికి దిగింది దిగాలుగా.
మైదానాల ఎదిగిన ఎండు గడ్డి గుండెల నిండా గుబురు బుగులు.

తెగి గాయమైన మట్టి పుట్టినరోజు ఇవాళ
కోతలతో రక్తస్రావమే ఇసుక శరీరమంతా.

నాగరికతలు నరుకుతున్న తలలు నేలలు
కలిసిన మహాసముద్రాలు విభజన రేఖలు లేవు
భూభాగాలకు తప్ప ఆక్షేపణ ఆయుషు సరసులది.

పొద్దుపొడిస్తేనే ఇవాళ ఆవిరైన మంచు బిందువు
రేపటి ఎండిన చరివేమో కరివేమో.
కదులుతున్న కాలువ కూలబడింది.

పచ్చని మొలకలు ఎదుగుతున్న అర్ధ దాని పేరు దయా దాని ఊరు.
ఉంటే నీటిలో ఉండు లేదా నేలపై ఉండు పత్వా జారీ చేసిన ప్రకృతి.

ఆకలిగొన్న ఆకు సూర్యుని ఇంటికి వెళ్ళింది
సూర్యుడు సముద్రం ఇంటికి వెళ్ళాడు
పాపం పచ్చని చెట్టు పుట్టింది మేగం ఒకటి పుట్టింది అక్కడే.

నిశ్శబ్దంగా పెరిగిన మొక్క భూమి పైనే ఒక అద్భుత జీవి.

మరణిస్తున్న నేల మరణిస్తున్న మనిషి మళ్లీ పుట్టాలంటే
మొక్క పెరగాలి సూర్యుడు పచ్చని ఆకు అవ్వాలి.!!!

డా.ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు