ఎన్టీఆర్!!!;- Dr.ప్రతాప్ కౌటిళ్యా
ఎన్టీఆర్ తెలుగింటి కంటి చూపు
నిర్వికారుని ఆకారానికి శ్రీకారం చుట్టిన
దేవుడు దేవదేవుడు.!!

రుతువుల్లా పాత్రలు సృష్టించిన
హనుమంతుడు చెక్కిన రాముని శిల్పం అతడు.
వ్యాసుడు చేసిన వాసుదేవుడు అతడు.!!

భారత రామాయణ భాగవతాలను
తెలుగింటి వేదాలు గా మార్చిన
ఒక మహా యోధుడు ఎన్టీఆర్!!!

ఆకాశంలో అన్ని నక్షత్రాలై ఒక వెలుగు వెలిగిన
పురాణ పురుషుడు అతడు.
వెతికినా దొరకని అతని వ్యక్తిత్వం
భక్తి దేశభక్తి!!
అర్థం కాని భౌతికతత్వాన్ని బయటపెట్టిన
ఒక కార్మిక కర్షక పక్షపాతి అతడు!!

ముక్కలు ముక్కలుగా చేసిన మళ్లీ మళ్లీ అతుక్కునే
ఒక డిఎన్ఏ ఎన్టీఆర్!!!
మళ్లీ మళ్లీ చంపిన మరణానికి అతీతంగా బ్రతికే
ఒక హైడ్రా ఒక జల్లి పిష్ ఎన్టీఆర్!!!?

కళల్ని సృష్టించిన మొదటి మానవుడు మన ఎన్టీఆర్.!!
కళల్ని పోషించిన ఒకే ఒక కళాకారుడు మన ఎన్టీఆర్!!!

తెలుగింటి గౌరవం ఆత్మగౌరవం అతని గర్వం.!!
గర్జించి గాండ్రించి తెలుగు నేలపై తిరిగిన ఒక సింహం ఒక పులి మన ఎన్ టి ఆర్!!

జన్మనిచ్చిన తెలుగు తల్లికి ఒక కొడుకుగా
ఆడపడుచులకు అన్నగా ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్!!!

గంగిగోవులా పాలిచ్చిన ప్రజలకే పాలన ఇచ్చిన
విచిత్ర చైతన్య చరిత్ర ఎన్టీఆర్!!!
కుడి ఎడమలను కులమతాలను
ధనిక పేదలను ఒక్కటి చేసిన ఎన్టీఆర్ ను
దేశమంతా పిలిచింది తెలుగుదేశం అని!!!

ఆడవాళ్లు అతని బలం అభిమానులు అతని ధనం.
పల్లెలు చదువుకునే పిల్లలు అతని శక్తి!
పట్టణాలు పట్టభద్రులు ఆతనియుక్తి!!!

ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని ఏలలే
ఏలించాడు!!
పాలించలే-ప్రజలచే పరిపాలింప చేశాడు!!

ఎన్టీఆర్ తెలుగు గడ్డపై ఒక ఏకపాత్రాభినయం. ఏకైక చక్రవర్తి!!!

ఎన్టీఆర్ అంటే ఒక అధికారం ఒక ధైర్యం!
ఎన్టీఆర్ అంటే ఒక సంపద ఒక గొప్పతనం!!

అతడు విశ్వవిఖ్యాత నటుడే కానీ
నటించడం చేతకానివాడు.!!!
అతని చేతలే చరిత్రలో జరిగిపోని రాతలు!!
జై ఎన్టీఆర్!!!

ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని

Dr.Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273.

కామెంట్‌లు