విశ్వవాణి!!!;- Dr.ప్రతాప్ కౌటిళ్యా
పాదరసంలా పారుతున్న లావా
దగ్ధమైన అగ్నిపర్వతం ది కాదు
బంగారు గుణం గల ధ్వని అది
తరంగం అది.!!

కాల్చేసిన కర్రను ఎర్రని నిప్పులుగా మిగిల్చిన
కొలిమిలో ఉప్పొంగిన లోహం
అయితే ఉక్కు లేకపోతే నిప్పులాంటి ఇనుమేమో. కానీ
పగిలిపోయిన అద్దంలా మెరుస్తున్న మొండిది వెండి.
జలపాతం ఇప్పుడిప్పుడే కిందికి దిగుతోంది
అది ద్రవం కాదు శబ్దం తరంగాల దృవం!!?

కోట్ల నక్షత్రాలు లీలగా కదులుతున్న
మెల్లిమెల్లిగా మెదులుతున్న శబ్దాలు ఆఖరికి అవి తరంగాలు.

ఆవిర్భవించిన శరీరం మర్మం తరంగం
తరంగం అంగం శబ్దం.

శబ్దాన్ని ఆవిష్కరించిన భూగోళం
విశ్వకేంద్రం.
శబ్దాన్ని పుట్టించలేని విశ్వం శూన్యం.

ఘనం ద్రవం వాయువు అంతా తరంగం
తరంగం శబ్దం!? కానీ
విశ్వమంతా నిశ్శబ్దం.
శబ్దాంగాన్ని తొలగించిన విశ్వం వికలాంగి ఇప్పుడు.
పరీక్షించి వినికిడిని ఇచ్చే డాక్టరు భూమిక.

మెరిసే మెరుపు ఉరిమే ఉరుము
భూమి విసిరే సవాలు ఇప్పుడు.!!!

Dr pratapkoutilya 🙏

కామెంట్‌లు