ఎవ్విరి డే మే డే. (Every day May day);- డా.పివిఎల్ సుబ్బారావు.-94410 58797.
 శ్రామికదినోత్సవ,
          శుభాకాంక్షలతో !
  ================
  1.
  ప్రభువెక్కిన పల్లకి కాదోయ్! 
  అది మోసిన బోయిలెవ్వరు?  
  వేదం జ్ఞానానికి ఆది !
  స్వేదం జీవనానికి పునాది!
2.
ఎందరో అహోరాత్రాలు శ్రమిస్తే! 
మరెందరో ఆ శ్రమని దోచేస్తే! 
తేరగా బతుకంతా బతికేస్తే !
అసమానతలే విస్తరిస్తే,
         మనది ఓ బతుకేనా!
3.
   బతికే హక్కు శ్రమేగా! 
   శ్రమించే మనిషివి కా !
   శ్రమ సత్యమై జయిస్తుంది !
  సమ సమాజాన్ని నిర్మిస్తుంది!
4.
  హలాలు పట్టే కర్షకులు!
కర్మాగారాధారులు శ్రామికులు! 
ప్రాణంపణంగా పోరేసైనికులు!
వీరే జాతికి నిజ పోషకులు !
5.
వీరంతా ఒక్క మే డే నే కాదు! 
ఎవ్రీడే మనకి స్మరణీయులు! 
జాతికి అనుసరణీయులు!
ముఖ్యంగా యువత శ్రమిస్తే! 
 జడత్వం సదా అధిగమిస్తే!
 ముందడుగు వేసి ఉద్యమిస్తే! 
ప్రతి ఉదయం,మే ఒకటే,
జనం ఒకటైతే మహోదయమే!
________
.

కామెంట్‌లు