నమ్మకం ; -.G . జ్యోతి
 కుసుమ ధర్మన్న కళా పీఠం 
======================
మన రోజు వారి జీవనశైలిలో మనం ఎక్కడికైనా బయటకు బయలుదేరాలి అంటే ఆటో వారి మీద ఆధారపడుతూ ఉంటాం. ముఖ్యంగా ఆడవారు 30 లేదా 40 నిమిషాల ప్రయాణానికి వారి గుండెను అరచేతుల్లో పెట్టుకొని , లేని ధైర్యం మోహన పులుముకొని
ప్రయాణం సాగిస్తారు. ఎందుకంటే ఆ ఆటో  డ్రైవర్  ఎలాంటి వాడో ఏంటో తెలియక.
అలాంటిది ఒక వ్యక్తిని నమ్మి తాళి అనే మూడుముళ్ల బంధంతో అతని చిటికెన వేలు పట్టుకుని అతని వెనకాలే ఏడడుగులు వేస్తూ ధైర్యంగా అతని జీవితంలోకి ప్రవేశిస్తుంది ఆడది..అదే మన వివాహా వ్యవస్థ యొక్క గొప్పదనం.
వడిదుడుకులనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం. అందుకే మన పెద్దలు అంటారు కాళ్లు తడవకుండా సముద్రాన్ని ,కళ్ళు తడవకుండా సంసారాన్ని దాటలేము అని.
ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, కష్టసుఖాల్లో తోడుగా నిలుస్తూ నాకు నువ్వు నీకు నేను అంటూ ముందుకు సాగిపోవాలి. అప్పుడే మన జీవితానికి  అర్థం-పరమార్థం. 
ఇక నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పాలంటే నాకు మొదటి కాన్పు సమయంలో నేను చాలా సన్నగా ఉండేదాన్ని అందరూ భయపడ్డారు ఎలా ప్రసవం జరుగుతుందో అని .అలా భయపడ్డ వారిలో నా భర్త కూడా ఒకరు .దేవుడి మీద నమ్మకంతో భారమంతా ఆ దేవుడు పైన వేశారు మా ఆయన.
ఆయన నమ్మకం అమ్ము కాలేదు .నేను నా కొడుకు ఇద్దరం క్షేమం. ఆ దేవునికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలపడం తప్ప మనం ఏం చేయగలం చెప్పండి.
ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు నమ్మకం అని నావలో ప్రయాణం చేస్తే ఇక వారి  జీవితమంతా ఆనందాల హరివిల్లు....

కామెంట్‌లు