: నిరీక్షణ ;- M. T. రుద్రా- హైదరాబాద్
కుసుమ ధర్మన్న కళాపీఠం 
====================
ఎదురు చూడటంలో 
ఒక అవ్యక్తాను భూతి!

ప్రకృతిలో ప్రకృతినై 
నిశ్చల నయనాలతో!

ఈ తరువు ఛాయలో 
ఎన్నోసార్లు కలిసాము!

కోనేటి స్నానం దైవదర్శనం 
మన ఊసులు బాసలు!

ఈ ప్రకృతి సాక్షిగా అవి 
అన్నీ గుర్తు చేసుకుంటూ!

సూర్యాస్తమయవేళ నేను 
రోజూ ఇక్కడికి వస్తాను!

విశాల నేత్రాలు అన్నావు 
పికాసో చిత్రం అన్నావు!

బాపు గీతల వయ్యారం 
వంపుసొంపులు అన్నావు!

రవివర్మకు కూడా అందని 
అందమని వర్ణించావు!

ప్రపంచసుందరి మోనాలిసాకు 
తీసిపోననివర్ణించినభావావేశం!

నీ మాటలు గుర్తుకొచ్చి 
అసంకల్పిత గగుర్పాటు!

ఈ చెట్టుగాలి ఆ నదీజలం 
ఆకాశంలో కదిలే మేఘం!

మనగురించి వాటికీ తెలుసు 
అందుకే నన్నుచూసి నవ్వులు!

ఇది వసంత కోయిల 
కుహు కుహు రవమిది!

గతానుగత మన స్పర్శల
అమృతాను భూతి ఇది!

నీ రస స్పర్శల చంద్రికలకై 
ఎదురుచూస్తున్నచకోరాన్ని 

నీకోసం ఇది నా నిరీక్షణ!
ఎదురు చూస్తూనే ఉంటాను!
            ***-

కామెంట్‌లు