వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచనపల్లి,9182244143
 మానవ మనస్తత్వం  అందరికీ ఒక రకంగా ఉండదు  కొంతమంది అంగ బలంతో  మరి కొంతమంది స్వశక్తితో  మరి కొంతమంది  విజ్ఞానంతో  తమ కార్యాలను సాధించడానికి  ప్రయత్నం చేస్తారు ఒక ముళ్ళ బాటలో వెళ్ళవలసి వచ్చినప్పుడు  బృందంతో కలిసి వెళుతున్న అనుభూతి కలిగిన  మంచి మార్గాన్ని ఎన్నుకొని చక్కటి  ఆలోచనలతో వెళ్లడం మంచిది అని అనుభవం ద్వారా నేర్చుకుంటాడు వ్యక్తి  మనం ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించినప్పుడు  ఎవరో సహకరిస్తారు అన్న అభిప్రాయంతో  మొదలు పెట్టకూడదు  తన శక్తి సామర్ధ్యాలు ఏమిటో తనకు పూర్తిగా తెలిసి ఉండాలి  ఎదుటివారి కోసం కాకుండా  తాను చేస్తున్నది మంచి పనా చెడ్డ పనా అన్నది ఆలోచించుకొని ముందుకు వెళితే  మంచికి ఎప్పుడు చెడు జరగదు అన్న ఆర్యోక్తిని నిజం చేసిన వాడు అవుతాడు.
జీవితంలో కన్నీరు ఎప్పుడు వస్తుంది  ఆనందంలో  కన్నీరు కారుతుంది  బాధలోనూ కన్నీరే వస్తుంది  ఆ కన్నీటికి వెలకట్ట కలిగిన వాడు ఎవరు  నలుగురు స్నేహితులతో కూర్చుని హాస్యాలు ఆడుకుంటూ  చక్కటి  విమర్శలతో కూడిన హాస్యోక్తులను చెప్పుకుంటూ ఉంటే  అప్పుడు ఆనందబాష్పాలు  వస్తాయి  వాటిని అందరితోనూ పంచుకుంటాం  వ్యక్తిగతంగా జీవితంలో ఏదైనా ఒక లోపం జరిగినప్పుడు  విచారకరమైన ఘటన సంభవించినప్పుడు వచ్చే  కన్నీటిని నీవే దినమింగుకోవాలి   ఆ కన్నీటిని ఆనందభాష్పాలైన  దుఃఖ భాష్పాలైన తుడిచే వ్యక్తి  మన ప్రక్కన ఉంటే  ఎంత సంతృప్తిగా ఉంటుందో చెప్పలేము  కనుకనే  క్షణిక అవసరాలకు  వచ్చే స్నేహితులలో కాక  మనసు తెలిసిన మిత్రులను  కలుపుకుంటే జీవితంలో ఆ సంతృప్తి వేరు.భారతదేశ ఔన్నత్యానికి కారణం  కుటుంబ వ్యవస్థ  తండ్రి పెద్దగా వ్యవహరిస్తూ ఇంటి కార్యక్రమాలను అన్నిటిని చక్కబెట్టుకుంటూ  ఆ కుటుంబ సభ్యుల మొత్తాన్ని ఒక తాటిపైన నడిపించగలిగిన సత్తా కలిగిన స్థితి  పితృస్వామ్య వ్యవస్థ  అందంగా తృప్తిగా జరిగిన రోజులు  దీనికి వ్యతిరేకంగా కేరళ తదితర ప్రాంతాలలో మాతృస్వామ్య వ్యవస్థ  ఈనాటికీ కొనసాగుతూనే ఉంది అక్కడ తల్లి ఇంటి బాధ్యతలను  తన చేతిలోకి తీసుకొని కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తూ ఉంటుంది  ఈ వ్యవస్థలో స్త్రీలు   విజయవంతులయ్యారా పురుషులు  అక్రమంగా దారిలో పెట్టారు అని ఆలోచించినట్లయితే  ఎవరికి వారు వారు చేసినదే నిజమైన ప్రగతికి మార్గం  అని చెప్పుకోవడం సహజం  కానీ ఈరోజు యువతను మనం పరిశీలనగా చూసినట్లయితే  ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నడుస్తుందా అన్న అనుమానం రాక తప్పదు.


కామెంట్‌లు