మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.9666639489
 చక్ర తీర్థము తిరుమలకు రెండు మైళ్ల దూరాన వాయువ్య మూలలో ఉన్నది  ఇక్కడ పూర్వం శ్రీవత్స గోత్రీకుడైన పద్మనాభుడను బ్రాహ్మణుడు జితేంద్రుడిరోక  పత్రోదకంబులు భక్షించుచు  12 సంవత్సరాలు ఘోరంగా తపస్సు చేశాడు  రాక్షసబాధ  మిగుల హెచ్చుగా ఉన్నది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ప్రత్యక్షమై ఆ రుషి కి తన చక్రము ఇచ్చెను ఆ చక్రము వలన అసుర బాధ తగ్గింది తపస్సు చేయడానికి ఇది ఉత్తమ ప్రదేశంగా మారింది శ్రీరOగం లో సుందరుడు అను బ్రహ్మణుడు శాపం వల్ల రాక్షసరూపము పొంది ఈ తీర్థమునకు వశిష్ట మహా రుషి ప్రకారం రాగా సుదర్శనము వల్ల రాక్షసత్వం తొలగి తీర్థ స్నానం వలన పాపములు పోయి ముక్తి పొందెను.
ప్రతి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదసి నాడు మధ్యాహ్నం అక్కడికి దేవస్థానం నుంచి ఒక పాయసం తళిహా పాయసం తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి సుదర్శనానికి అభిషేకం అయిన తర్వాత ఆరగింపు వినియోగాలు చేస్తారు అప్పుడు అందరూ తీర్థస్నానం చేస్తారు ఆకాశగంగా ఇది శ్రీ స్వామి పుష్కరిని తీర్థములకు ఉత్తరమున రెండు మైళ్ళ దూరంలో ఉంది ఇక్కడ అంజనాదేవి త్రేతాయుగం లో 12 సంవత్సరాలు ఆహారం లేకుండా తపస్సు చేసి ఆంజనేయ స్వాములను  ప్రసవించినది అని చెప్తారు ఈ తీర్థం  పర్వతO నుండి ధారగా గనెను చాలా నిదర్శనం నిత్య నిర్మల ఉధకం నిత్యము శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధనకు మూడు బిందెలు తీర్థం వస్తుంది పూర్వకాలంలో రామానుజుడు ఆకూ ఆలమో తింటూ శంఖచక్రధరుడై లక్ష్మీ సమీతుడైన శ్రీమహావిష్ణువు పరివార సమేతంగా ప్రత్యక్షమయ్యను.
మేష మాసములో చిత్రా నక్షత్ర పూర్ణిమనాడు ఈ తీర్థములో స్నానం చేసినట్లయితే వారు పునరావృత్తి వర్జిత సుఖము పొందగలరు రామానుజుడు ఈ తీర్థం వద్ద నివసించుచు  కర్మ అనుభవముగా నీవు జన్మలో మత్స్య రూపంలో వుంటావు ఇక్కడ స్నానం చేసిన వారు భాగవతోత్తములు అని శ్రీ స్వామివారి గురించి చెప్పి భాగవత లక్షణాన్ని గురించి చెప్తున్నారు  సర్వ హితముగా అసూయ మచ్చరాలు లేకుండా జ్ఞానము  మునిత్వము శాంతము కలిగినవాడు అపరి గ్రహ శీలుడుగా ఉండిన మనోవాక్కాయ కర్మలచే పర వీడ చేయని వారు సత్కర్మ శ్రవణమందు సాత్విక బుద్ధి కలిగిన వ్యక్తి కలవారు పరనిండా చేయక సుగుణ గ్రహణం కావించువాడు  తల్లిదండ్రుల సేవించు వారు దేవతార్చన కు ఆసక్తి కలవారు  శత్రు మిత్ర భేదములేక ఆత్మవత్ సర్వభూతాలు ప్రకారము నడిచి వారు ధర్మశాస్త్ర వేత్తలు వీళ్లకు చేయుట గో బ్రాహ్మణ శుశ్రూష చేయువారు తీర్థయాత్ర పరులు అన్నదానం చేయువారు తోటలు బావులు దేవాలయాలు ఏర్పరిచేటువంటివారు.


కామెంట్‌లు