మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు 9666639489
 పూర్వకాలంలో గోదావరి తీరాన వేద వేదాంగపారంగతులు పుణ్యశీల వొక విప్రుడు ఉన్నాడు అతడు పితృ తిధి కి నిమస్త్రణకు గాను గొప్ప పండితుడు సుశీలుడును అయినా ఒక బ్రాహ్మణుని పిలిచాడు అనంతరకు పుణ్యశీలుడు  గాడిద ముఖం వచ్చింది అందుకు దుఃఖితుడైన కారణముగా స్వర్ణముఖరీ తీర్థమందు ఆశ్రమంలో ఉండు అగస్య రుషి వద్దకు వెళ్లి  పేదవారు ఇట్లు వచించిరి పుత్రుడు లేని బ్రాహ్మణుని నియంత్రణలకు నిర్మించుటచే ఇట్లు దోషము కలిగినది అని చెబుతూ వెంకటాచల మందు వియద్గంగ గలదు ఆ పర్వతముల కేగి అక్కడ సర్వపాపహరమునకు శ్రీ స్వామి పుష్కరిలో సంకల్ప పూర్వకముగా స్నానం తర్వాత ఆకాశగంగా తీర్థములో స్థానం చేసిన తరువాత  ఈ వికార రూపం పోతుంది అని చెప్పగానే అతను అలా చేయగా ఆ రూపం పోయినది.
పాప వినాశనము ఈ తీర్థం శ్రీవారి  పుష్కరిణికి ఉత్తర భాగాన మూడు మైళ్ల దూరంలో ఉంది ఇక్కడి స్నానం ముక్తిదాయకము  ఈ తీర్థమునకు ముక్కోటి అగు ఆశ్వయుగ శుద్ధ సప్తమి ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడిన ఆదివారము నాడు గాని ఉత్తరాభాద్ర నక్షత్రాయుక్తమైన ద్వాదశ నాడు గాని స్నానము మిగుల శ్రేష్టము  ఘోణ తీర్చము ఈ తీర్థము శ్రీ స్వామి పుష్కరిణికి ఉత్తరమున పది మైళ్ళ దూరంలో ఉంది  ఆ ప్రదేశం చూడ్డానికి  బహు రమణీయ రమణీయంగా ఉంటుంది ఇది దట్టమైన అరణ్యo మధ్యలో ఉంది మీన మాసంలో ఉత్తర ఫల్గుణీ నక్షత్ర యుక్త పౌర్ణమి  పౌర్ణ మహన్య దినమున ఈ తీర్థము ముక్కోటి అచ్చటకు అప్పుడు అనేక జనములు వెళ్లి స్నాన జప భోజనాధులు గావించి సాయంకాలమునకు తిరిగి వచ్చేదారు దేవస్థానము నుంచి శ్రీవారికి ఆరోగ్యం అయిన ప్రసాదములు చందనము తాంబూలం సహా అక్కడికి వెళ్లిన జనానికి ఆహారo పంపబడుతుంది.
అక్కడ చేసిన స్నాన ఫలము చెప్పనలవి కాదు కోటి కన్యాదానములు గోదానములు మొదలైన ఫలం ప్రాప్తిస్తుంది  సమస్త పాపాలు హరించి పోతాయి ముక్తిని ఇస్తుంది గంగాది నధులలో స్నానం చేయడం వల్ల వచ్చే ముక్తి పుణ్యం సంప్రాప్తిస్తోంది స్త్రీ సంగలోలు గురు విప్రజన ద్వేషము ఆత్మస్తుతి అసంతృప్తి భోజనం మాత పితృ విరోధము బ్రాహ్మణుడు  తర్భ పాణియై చండాలనితో బాషించుట పితృ యజ్ఞ పరిత్యాగము మొదలగువారి వలన దోషములను ఘోణ తీర్థ స్నానం వల్ల పోతాయి ఇందరి స్నానం వల్ల పునరావృత్తి వర్జతమైన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.


కామెంట్‌లు