మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.9666639489
 గర్భాలయమునకు ముందు పై నియేర్పబడినమూర్తులకు కొన్ని గజముల దూరముననింకొక ప్రదేశమున నొక పార్శ్వంబున సుగ్రీవ అంగద హనుమాన్లున్ను, రెండవ పార్శ్వమున అనంతగరుడవిష్వక్సేనులున్ను గలరు. వారికి ముందు కొన్ని గజముల దూరమున బంగారు వాకిలి ముందు ఇరుప్రక్కల జయవిజయులను ద్వారపాలకులున్నుఁయి వార్లకు వెండి కటాంజనముతో గుడివలె కట్టబడియున్నది. గర్భాలయము అనఁగా బంగారు. వాకిలిదాటి విమాన దక్షణములో దేవతలగు శ్రీయోగనృసింహస్వామి శ్రీవరదరాజస్వామి దేస్థానములున్ను భక్తులగు శ్రీభాష్యకారులు, శ్రీసేనాధిపతి, శ్రీగరుడాళ్వార్ల దేవస్థానములు గలవు. వంటశాలలో శ్రీవకుళమాలికా దేవిగుడిగలదు. ధ్వజస్తంభము వద్ద క్షేత్రపాలక శిల* గలదు. ఇచ్చటనే అర్చకులు ఇంటికి వెళ్లునపుడున్న దేవస్థానమునకు వచ్చునపుడున్ను బీగము చెవులు తాకించివెళ్లవలెను. క్షేత్రపాలకులు పూర్ణకళతో గోగర్భము వద్దనున్నా వీరి ప్రభావము గుఱించి అనేక కథలు గలవు.
ముద్రమండపం
ఎవరయినను శ్రీవారి దేవస్థానములో తప్తాంకితము చేసుకొనవలెనన నఫరు 1-కి ర్చు 0-12-4 వంతున పారుప్య దార్ ఖచేరిలో చెల్లించిన యెడల ఒక్క శ్రీవైష్ణవక బ్రాహ్మణునిచే వారికి చక్రాంకితము కావింపబడును.
క్షేత్రపాలకశిల : ధ్వజస్తంభము వద్ద ఈశాన్యములో వున్న చిన్నశిల గోగర్భములో వున్న క్షేత్రపాలక గుండుకు యీయన ప్రతీక. అర్చకులు తాము వచ్చుపోవునప్పుడు ఆలయతాళాలు యీయనకు తాకిస్తారట. అప్పుడు చేసేవారేమో?
ముద్రమండపం : చక్రాంకితములు అంటే శరీరముమీద వైష్ణవ ముద్రలు తాపడం చేయించుకోవడం. యిప్పుడు లేదు.
ఈ పర్వతమున 360 తీర్థములుగలవనియు అందులో కొన్ని అంతర్థానమనియు, కొన్ని మిగుల కష్టసాధ్యమనియు చెప్పెదరు. యాత్రికులకు సులభ సాధ్యములగు తీర్ధములు కొన్నిగలవు.
1. శ్రీస్వామిపుష్కరిణి
ఈ తీర్థమును గురించి అనేక పురాణములు బహు తెరుగుల వర్ణించినవి. ఏ పురాణములో జూచిన నీతీర్థమహాత్మమద్భుతముగా చెప్పబడినది. గ్రంధ బాహళ్యమగునని స్వల్పము నిందు చెప్పబడినది.
శ్రీస్వామి పుష్కరిణి గంగాది మొదలగు సర్వతీర్థములకు జన్మభూమనియు, పంచ మహాపాతకములు పోగొట్టినదియు, స్నాన మాత్రమున నైహికాముష్మికముల నిచ్చునదియు, అంగ వైకల్య దోషములను బోగొట్టునదియు, వైకుంఠము నుండి శ్రీమహావిష్ణు అమ్మవార్ల సహా క్రీడార్ధం శ్రీస్వామిపుష్కరిణి తీరమునకు వచ్చినారనియు మొదలగు మహిమ వర్తింపబడినది.

కామెంట్‌లు