మన తిరుపతి వెంకన్న;- చిరసాని శైలూషి,నెల్లూరు.9666639489
 పూర్వకాలమున ఒకానొక ముసలి బ్రాహ్మణుడు ఉన్నాడు అతడు బీదరికంతో బాధపడుతూ ఉన్నాడు కుటుంబ సంరక్షణ చేసుకోలేకపోతున్నాడు దరిద్ర దోషం వలన ఇహపర సాధనము లేక ఎంతో దుఃఖిస్తూ ఉండేవాడు  ఈ కష్టాన్ని భరించలేక ఒకనాడు స్వర్ణముఖి నది  సమీపమునకు వెళ్లి ఆ చెంతనే ఉన్న శేషగిరి శిఖరానికి బ్రహ్మ విష్ణు మహెంద్రాది దేవతలారా నవగ్రహాదులారా సర్వభూతములారా నేను  అతీత దరిద్ర పీడితుడిని ఈ కుటుంబ సంరక్షణ చేయలేక ఇహలోక సుఖము లేక ధర్మాచరణ శక్తి చే పరలోక  సుఖంబు కానక ఉన్నాను  వృద్ధుడనై దరిద్రదోష హతుడగుట జన్మవ్యర్థము పర్వత శిఖరం నుంచి  దూకి ప్రాణత్యాగ దోషంబు లేదు అని పెద్దగా రోదించారు నేను పడుచున్నాను పడుచున్నాను పడుచున్నాను అని పడిపోవుచుండగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మృగయార్ధమై ఏ తెంచిన ఒక రాజపుత్రుని వల్లే దర్శనమిచ్చి పర్వతము కింద నుంచి బ్రాహ్మణులకు జరుగు పతనంబు దోషము పర్వత శిఖరం దిగమని చెప్పగా ఆ విప్రుడు ఓ రాజా నన్ను నా భార్య బిడ్డలను కాపాడారు అన్నాడు సర్వందధామి అని రాజపుత్రుడు ఆనతి ఇవ్వగా ఆ బ్రాహ్మణుడు దిగి వచ్చాడు.
ఆ ప్రభువు వద్ద బ్రాహ్మణుని చేయి పట్టుకొని తన చేతితో తీసుకొని వెళ్లి పాపనాశనమునకు ఉత్తరములో ఉన్న తీర్థమున స్నానం చేయి  దుఃఖ శాంతి ఐ కౌమారము వస్తుంది అని చెప్పాడు ఈ విషయం మార్కండేయ పురాణంలో ఉన్నది ఆ బ్రాహ్మణుడు స్నానము చేయుచుండగా ఆ రాజు పుత్రుండు అంతర్జానమయ్యాడు  తను వదిలి రాజకుమారుడు ఎక్కడికి పోయాడు అని మిత్రుడు వినపించుచుండగా ఒక శబ్దం ఓ బ్రహ్మరుడా శ్రీ వెంకటేశ్వర కృపా కటాక్షం వలన ఇహలోకములో ఐశ్వర్య సుఖమును పొందెదవు కదా నీ దేశమునకు పోయి భార్య బిడ్డల సహితముగా ఉండు శరీరంలో బలమునప్పుడే ధర్మం చేయండి అని మొదలగు నితోపదేశం వెల్లడి చేశాడు.దరిద్ర పీడితుడైన ఈ వృద్ధ బ్రాహ్మణునకు ఈ తీర్థ స్థానమునకు  కుమారత్వం ప్రార్థన అయింది కూర్చోడు ఇందు స్నానం చేసిన మాత్రమున కౌమార దశ పొందడం కుమార  భారతీర్థమని పేరు కలిగినది  శ్రీ కుమారస్వామి దేవసేనానిగా ఉండి దేవతల ప్రత్యర్థము సారకాసురుని సంహరించి నందు వలన బ్రహ్మలో ప్రణవ పూర్వక శ్రీ వెంకటేశ్వర మంత్రము జపించుతూ స్నానం చేసిన  తరువాత దోషము హరించునని పురందరుడు ఆనతెవ్వగా ఆయన చెప్పినట్లు చేసినందున ఆ దోషము పోయింది ఒక కల్పము ఈ తీర్థం వద్ద శ్రీ కుమారస్వామి వారి ఆజ్ఞ ప్రకారం ఉన్నారు.


కామెంట్‌లు