సజ్జనుల సహవాసం కవిమిత్ర, శంకర ప్రియ., శీల సంచార వాణి:- 99127 67098
   అందరి శ్రేయస్సు కోరి
సజ్జనుల సహవాసం
     మనోరంజక మైనది!
 ఓ ఆత్మబంధువు లార!
    [ అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ]
👌లోకంలో మంచిగంధం.. సువాసనతో చల్లదనమును కలిగి స్తుంది! ఆ మంచిగంధము కంటే చంద్రుడు.. వెన్నెలను వెదజల్లుతూ, చల్లదనము కలిగిస్తాడు! ఆ విధంగా, మంచి గంధము, చంద్రుడు... రెండింటి కంటెను... అందరి మేలును ఆకాంక్షించు; సజ్జనుల సహవాసము .. మిక్కిలి చల్లదనమును కలుగజేస్తుంది. అనగా, మనసుకి ఆహ్లాదమును, ప్రశాంతతను... సమకూరుస్తుంది. బహు విధములైన ప్రయోజనములను అనుగ్రహిస్తుంది. అందువలన సత్పురుషుల సాంగత్య ప్రభావం అభివర్ణింపలేము!
 👌మంచి మాట
చందనం శీతలం లోకే 
చందనా దపి చంద్రమా1
చంద్ర చందన యోర్మధ్యే 
శీతలా సాధు సంగత:!
    [ .... సుభాషిత రత్నావళి .,]
        🚩తేట గీతి పద్యము 
  జగము నందున చంద్రుండు చందనమ్ము
  చల్లదనము నొసగ నౌను సంతసమున
  సజ్జనులదగు సాంగత్య సంఘ మరయ
  నంతకంటెను మించు సత్సంపదౌను!

      [తెలుగు సేత:- డా. శాస్త్రుల రఘుపతి.,]
         *************
        🚩తేట గీతి పద్యము 
  చందనము లోకమందున చల్లదనము 
  చందనము కంటె చంద్రుండు చల్లదనము 
  చందనము చంద్రులను మించి చల్లదనము 
  సజ్జనులయొక్క సాంగత్య మిజ్జగమున.

    [తెలుగు సేత: విద్వాన్, పైడి హరనాథ రావు.,]

కామెంట్‌లు