కదలండి..... కదలిరండి* ;- ప్రభాకర్ రావు గుండవరం -ఫోన్ నం.9949267638
 కదలిరండి 
కదలిరండి 
ఓ బ్రాహ్మణ యువతా!!
మన శక్తి చూపుదాం 
మన సత్తా చాటుదాం 
ఆసేతు హిమాచలం వరకు 
మన బలగం నింపుదాం 
అందరమేకమై
కదం కదం కలిపితే 
ఈ జగమంతా కదలదా 
మనకు న్యాయం జరుగదా 
మన జాతి మన మతము 
అఖండ జ్యోతిగా వెలుగదా 
బ్రాహ్మణులు ఒకటైతే 
బ్రాహ్మణులే గర్జిస్తే 
భూనాభోంతరాళమే 
అతలాకుతలము కాదా
అందర్నీ కలుపుకుంటూ 
ముందుకు సాగుదాం 
అన్యాయం ఎదిరిస్తూ 
అనుకున్నది సాధిద్దాం 
కదలండి కదలిరండి 
ఓ బ్రాహ్మణ యువతా 
జయ నినాదం చేస్తూ 
విజయోత్సాహం జరుపుదాం
🍒🍒🍒🍒🍒🍒🍒🍒🍒


కామెంట్‌లు