కొబ్బరి బొండాల వ్యాపారం;- కె. ఉషశ్రీ.- 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల- నీర్మాల
 అనగనగా ఒక ఊరిలో ఇద్దరు దంపతులు ఉండేవారు. కొమురయ్య, నర్సమ్మ వాళ్లకు పిల్లలు లేరు. వాళ్లు ఒక చిన్న కొబ్బరి బొండాల బండి పెట్టి కొబ్బరి బొండాలు అమ్ముతారు. వారిది చాలా పేద కుటుంబం. కొబ్బరి బొండాలు అమ్మితే కానీ తినడానికి అన్నం ఉండదు. వాళ్ల జీవితం కొబ్బరి బొండాలతోనే సాగుతుంది. రోజుకు ఇరవై మంది నుండి యాబై మంది దాకా వస్తారు. ఐదు సంవత్సరాలకు కొబ్బరి బొండాలతో పెద్ద ధనవంతులు అయ్యారు. డబ్బులు పోగుచేసి పెద్ద భవనం కట్టారు. ఇంట్లో పని వారిని పెట్టుకొని పనులు చేపిస్తున్నారు. వారు ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. మరియు ఆ డబ్బులతో పాఠశాలలు చదువుకునే వారికి డబ్బులు ఇచ్చి చదువుపిస్తున్నారు.
నీతి, పేదవారిని అని అక్కడనే ఉండవద్దు. మనకు తోచిన పని చేసుకుని మన కాళ్ళ మీద మనం బ్రతకాలి. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధిస్తాం. పట్టుదల ఓర్పు ఉంటే విజయం మనదే.

కామెంట్‌లు